బ్రహ్మానందం కామెడీని చూశాక తండ్రి ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా?.. జీవితాంతం గుర్తిండిపోతుందేమో..

Published : Mar 06, 2024, 04:14 PM IST

బ్రహ్మానందం అంటే నవ్వు, నవ్వు అంటే బ్రహ్మీ.. అనేంతగా తనదైన ముద్ర వేసుకున్నారు బ్రహ్మానందం. కోట్లాది మంది ప్రజాదరణ పొందారు. మరి తన కామెడీ చూసి ఆయన తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏం చెప్పాడనేది చూస్తే..   

PREV
18
బ్రహ్మానందం కామెడీని చూశాక తండ్రి ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా?.. జీవితాంతం గుర్తిండిపోతుందేమో..

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం అత్యధిక సినిమాలు చేసి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ నవ్విస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఆయన తనలోని కొత్త కోణాలను బయటపెడుతున్నారు. నవ్వుతో తెలుగు సినిమాని శాషించిన ఆయన నటనతోనూ భావోద్వేగానికి గురి చేస్తున్నారు. తనకంటే బాగా ఎవరూ ఏడిపించలేరని ఇటీవల `రంగమార్తాండ`తో నిరూపించుకున్నాడు. 
 

28

కానీ బ్రహ్మానందం అంటే నవ్వులే గుర్తొస్తాయి. ఆయన కనిపిస్తేనే నవ్వు పెదాలపై కనిపిస్తుంది. వెండితెరపై ఆయన కనిపించాడంటే థియేటర్లో నవ్వులు పూయాల్సిందే. అంతగా తన నవ్వులతో తెలుగు ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయారు బ్రహ్మానందం. అయితే బ్రహ్మీ కమెడియన్‌గా మారినప్పుడు వాళ్ల పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్లు, వాళ్లు ఏం చెప్పేవాళ్లు అనేది ఎప్పటికీ ఆసక్తికరమే. తాజాగా ఆ విషయాలు బయటకు వచ్చాయి. 
 

38

బ్రహ్మానందం తమ పేరెంట్స్ కి ఎనిమిది మంది సంతానంలో ఒకరు. తండ్రి పేరు నాగలింగం, తల్లి లక్ష్మి నర్సమ్మ. ఆర్ట్స్ లో మాస్టర్‌ చేసిన బ్రహ్మానందం.. అత్తిలి కాలేజ్‌లో తెలుగు లెక్చరర్‌గా జాయిన్‌ అయ్యారు. ఈ క్రమంలో నాటకాలు ప్రదర్శించారు. థియేటర్‌ ఆర్టిస్ట్ గా మెప్పించారు. అనేక మిమిక్రీ షోస్ చేశారు. అక్కడ్నుంచి డీడీ తెలుగులో షోస్‌ చేశారు. ఈ షోస్‌ చూసే దర్శకుడు జంధ్యాల తన `ఆహా నా పెళ్లంట` సినిమాలో ఎంపిక చేశారు. 

48

బ్రహ్మానందం `ఆహా నా పెళ్లంట` కంటే ముందే మూడు నాలుగు సినిమాల్లో నటించగా, ఈ మూవీ మాత్రం ఆయకు బ్రేక్‌ని తెచ్చింది. ఆ సమయంలో తన తండ్రి నాగలింగం చారి థియేటర్లో ఆడియెన్స్ తో కలిసి ఆ సినిమాని చూశారు. థియేటర్లలో బ్రహ్మానందం కామెడీకి అంతా నవ్వుతున్నారు. అది తండ్రికి చాలా ఆశ్చర్యంగా ఉందట. ఏం అర్థం కాలేదట. ఏంటీ మాయా అనిపించిందట. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలను తెలిపారు బ్రహ్మానందం. 
 

58

అలీతో ఆ మధ్య ఓ టాక్‌ షోలో బ్రహ్మా పాల్గొన్నారు. ఇందులో `నాన్నగారు మీ సక్సెస్‌ని చూశారా? ఆయన ఏమన్నారు` అని ప్రశ్నించగా, దీనికి బ్రహ్మీ చెబుతూ, బిగినింగ్‌ స్టేజ్‌లో `ఆహా నా పెళ్లంట` సినిమాలో తనని చూశాడట వాళ్ల నాన్న.

68

థియేటర్లో ఆ సినిమాని తండ్రికి చూపించాడట బ్రహ్మీ. అది చూసేటప్పుడు ప్రజలు నవ్వుతూనే ఉన్నారు. అది చూశాక `ఎలా రా ఎలా సాధ్యం ఇంత మందిని నవ్వించడం అని ఆయన సంతోషంతో ఉప్పొంగిపోయారట. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

78

1976లో హాస్య నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన బ్రహ్మానందం ఇప్పటికీ ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది. సుమారు 1200కిపైగా చిత్రాల్లో ఆయన నటించి నవ్వులు పూయించారు. ఇటీవల ఆయన `వీర సింహారెడ్డి`, `రంగమార్తాండ`, `బ్రో`,`భోళా శంకర్‌`, `ఖుషి`, `కీడా కోలా` చిత్రాల్లో నటించారు. 
 

88

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. కానీ కొత్త కమెడియన్లు సినిమాల్లోకి దూసుకురావడంతో బ్రహ్మీ క్రేజ్‌ తగ్గిపోయింది. జబర్దస్త్ కమెడియన్ల ప్రభావం చాలానే ఉంది. ఇప్పుడు రేర్‌గా సినిమాలు చేస్తూ అడపాదడపా మెరుస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories