ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఇండియన్ మొత్తం ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. పుష్ప చిత్రంలో తన మ్యానరిజమ్స్, డైలాగ్స్, స్టెప్పులతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన బన్నీ పుష్ప 2 తో ఏం చేయబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొంది.