గుడ్డిగా అందరినీ నమ్మేశా, 7 ఫ్లాపులతో ముంచేశారు..నిన్నెలా నమ్మాలి, బోయపాటితో బాలయ్య కామెంట్స్

First Published | Nov 10, 2024, 7:54 PM IST

నందమూరి బాలకృష్ణకి తన కెరీర్ లో 2004 నుంచి 2009 వరకు బ్యాడ్ పీరియడ్ ఎదుర్కొన్నారు దాదాపు ఆరేళ్ళు బాలయ్యకి వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కంటే ఎక్కువ ఫ్లాపులు.. మొత్తం 7 ఫ్లాప్ చిత్రాలు పడ్డాయి.

నందమూరి బాలకృష్ణకి తన కెరీర్ లో 2004 నుంచి 2009 వరకు బ్యాడ్ పీరియడ్ ఎదుర్కొన్నారు దాదాపు ఆరేళ్ళు బాలయ్యకి వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కంటే ఎక్కువ ఫ్లాపులు.. మొత్తం 7 ఫ్లాప్ చిత్రాలు పడ్డాయి. బాలయ్య మార్కెట్ అంతకంతకు దిగజారుతూ వచ్చింది. ఎలాంటి మూవీ చేసినా వర్కౌట్ కావడం లేదు. ఆ టైంలో బాలయ్య ఆలోచనలో పడ్డారు. 

సరిగ్గా అదే టైంలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి బాలయ్య దగ్గరకి వెళ్లారు. అప్పటికి బోయపాటి రెండు చిత్రాలకు దర్శకత్వం చేశారు. భద్ర, తులసి రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ బాలయ్య ఆ టైంలో ఏ డైరెక్టర్ ని నమ్మే పరిస్థితిలో లేరు. బోయపాటి కంటే ఎక్కువ హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా ఆ టైంలో బాలయ్యకి ఫ్లాపులు ఇచ్చారు. దీనితో బాలయ్యకి బోయపాటిపై నమ్మకం లేదు. బోయపాటి మాత్రం కథని అద్భుతంగా వివరించారట. ఈ విషయాలని బోయపాటి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 


డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి.. డాక్టర్ పాత్రలో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఇవన్నీ బోయపాటి వివరించారు. బాలయ్యకి బోయపాటి కథ చెప్పిన విధానం.. ఆ కాన్ఫిడెన్స్ నచ్చాయి. కానీ నమ్మకం కుదరడం లేదు. అంతకు ముందు బాలయ్య చిత్రాలకు బోయపాటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. దీనితో బాలయ్య బోయపాటిని అమ్మా శ్రీను అని పిలుస్తారట. అమ్మా శ్రీను నువ్వు కథ చాలా బాగా చెప్పావు. ఎలా తీస్తావో కూడా కాన్ఫిడెంట్ గా చెప్పావు. 

నీకంటే పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన దర్శకులు కూడా ఇంతకు ముందు నాకు ఇలాగే చెప్పారు.వాళ్ళని గుడ్డిగా నమ్మేశా. కానీ వరుసగా 7 ఫ్లాపులతో ముంచేశారు. వాళ్ళు చెప్పినదానికి సినిమా తీసే విధానానికి పొంతన ఉండడం లేదు. కొన్ని చిత్రాలు రెండో రోజుకే పడిపోతున్నాయి. నిన్ను ఎలా నమ్మాలి అని బాలయ్య అడిగారట. దీనికి బోయపాటి ఇచ్చిన సమాధానం ఒక్కటే.

బాబు ఇది నాకు లైఫ్ అండ్ డెత్ మూవీ. మీకు ఏఈ సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా ఉంటుంది. కానీ నేను మాత్రం ఇంటికి వెళ్లిపోవాల్సిందే.. ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు అందరిని నమ్మారు.. ఈ సినిమా కూడా పోతే పోయింది అనుకుని నాకు ఛాన్స్ ఇవ్వండి. మీ కోసం కాదు.. నా కోసం నేను ఈ సినిమాని హిట్ చేసుకుంటా అని బాలయ్యకి చెప్పారట. ఆ విధంగా సింహా చిత్రం మొదలైంది. బాలయ్య ఫ్లాపులకు బ్రేక్ వేస్తూ సంచలన విజయంగా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ ఎంత క్రేజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన లెజెండ్.. అఖండ ఒకదానిని మించేలా మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 

Latest Videos

click me!