అల్లు అర్జున్-బోయపాటి పాన్ ఇండియా మూవీ ఫిక్స్.. త్రివిక్రమ్ సైడ్ అయినట్లే, ఆ ఎఫెక్టేనా

First Published Jan 26, 2024, 8:34 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ముస్తాబవుతోంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ముస్తాబవుతోంది. ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగాన్ని మించేలా ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచేలా సుకుమార్ పుష్ప 2ని చెక్కుతున్నారు. 

అయితే చాలా మంది స్టార్ హీరోలు ఆల్రెడీ రెండు మూడు చిత్రాలకు కమిటయ్యారు. రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల లైనప్ బలంగా ఉంది. మరి బన్నీ పుష్ప 2 తర్వాత చేయబోయే చిత్రం ఏంటి అనే ప్రశ్న అలాగే ఉంది. ఆ ప్రశ్నకు అఫీషియల్ గా సమాధానం దొరికేసింది. సరైనోడు కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. 

Latest Videos


బోయపాటి శ్రీను గత చిత్రం స్కంద నిరాశ పరిచి ఉండొచ్చు. కానీ స్టార్ హీరోలకు బోయపాటి పై ఎప్పటికీ నమ్మకం అలాగే ఉంటుంది. ఎందుకంటే బోయపాటి హీరోలని ప్రజెంట్ చేసే విధానం ఆ రేంజ్ లో ఉంటుంది మరి. అయితే సరైనోడు తర్వాత బోయపాటి బన్నీతో మూవీ చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ తో పాటు, అల్లు అరవింద్ తో కూడా ఓకె అనిపించుకున్నారు. 

అల్లు అర్జున్ హీరో అని ప్రకటించకపోయినా అల్లు అరవింద్, బోయపాటి కాంబోలో చిత్రం అంటూ గీతా ఆర్ట్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అల్లు అర్జున్ తోనే ఈ చిత్రం అన్నది ఇక లాంఛనం. కొన్ని వారాల క్రితమే బోయపాటి బన్నీ, అల్లు అరవింద్ కి తాను సిద్ధం చేసిన భారీ పాన్ ఇండియా కథని వినిపించారట. బన్నీ కోసం బోయపాటి క్రియేట్ చేసిన ఆ కథ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని వార్తలు వస్తున్నాయి. 

ఆ నమ్మకంతోనే బన్నీ, అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు లాక్ చేశారు. పుష్ప హంగామా ఆగష్టు లో ముగుస్తుంది. ఈ లోగా బోయపాటి, అల్లు అరవింద్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంటారు. ఆగష్టు తర్వాత బన్నీ షూటింగ్ షురూ చేస్తాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయాల్సింది. ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్టు ఖరారు కూడా అయింది. 

ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ త్రివిక్రమ్ సైడ్ అయిపోయి బోయపాటి లైన్ లోకి వచ్చారు. దీనితో గుంటూరు కారం ఎఫెక్ట్ ఏమైనా పడిందా అనే అనుమానాల్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే అదంతా సంక్రాంతి గాలి, మహేష్ క్రేజ్ అని క్రిటిక్స్ నెటిజన్లు అంటున్నారు. సినిమాలో పూర్తిగా త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. అందువల్లే బన్నీ త్రివిక్రమ్ ని పక్కన పెట్టాడా అనే చర్చ కూడా జరుగుతోంది. 

click me!