రాజమౌళికి బోనీ కపూర్ రిటర్న్ గిఫ్ట్... దసరా లెక్క సంక్రాంతికి సెట్ చేయాలని హీరో అజిత్ తో ప్లాన్

Published : Dec 24, 2021, 11:30 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి అన్ని భాషల్లో లైన్స్ క్లీయర్‌, ఇక సోలో రిలీజ్‌ ఉంటుందని అంతా భావించారు. సంక్రాంతి మొత్తం దున్నుకోవచ్చని ఫీలయ్యారు. కానీ లెక్క మారిపోయింది. బోనీ కపూర్‌, అజిత్‌ రంగంలోకి దిగారు. 

PREV
16
రాజమౌళికి బోనీ కపూర్ రిటర్న్ గిఫ్ట్... దసరా లెక్క సంక్రాంతికి సెట్ చేయాలని హీరో అజిత్ తో ప్లాన్

సంక్రాంతికి రెండు తెలుగు పాన్‌ ఇండియా సినిమాలు ఇండియన్‌ బాక్సాఫీసుని టార్గెట్‌ చేశాయి. రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న `ఆర్‌ఆర్‌ఆర్‌`, ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచారు. వారం గ్యాప్‌తో రెండు సినిమాలు రాబోతున్నాయి. మధ్యలో రిలీజ్‌ కావాల్సిన `భీమ్లా నాయక్‌`ని వాయిదా వేయించారు. రెండు పాన్‌ ఇండియా సినిమాలే కావడంతో పోటీ గట్టిగానే ఉంటుందని, అయితే వారం గ్యాప్‌ రావడంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` బయటపడుతుందని భావించారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రాలకు పోటీనే లేదు. 

26

ఈ క్రమంలో తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`లకు పెద్ద దెబ్బ పడబోతుంది. రంగంలోకి అజిత్‌ దిగారు. అజిత్‌ సహకారంతో బోనీ కపూర్‌ తన సినిమా విడుదల ప్రకటించారు. అజిత్‌తో ఆయన నిర్మిస్తున్న `వాలిమై` చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ అడ్డంకి లేదని భావించిన రాజమౌళికి, ప్రభాస్ సినిమాలు పెద్ద షాక్‌ ఇచ్చాడు. అనూహ్యంగా అజిత్‌ హీరోగా రూపొందుతున్న `వాలిమై` రిలీజ్‌ డేట్‌ ప్రకటించి షాక్‌కి గురి చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

36

`వాలిమై` వస్తే అది తెలుగు సినిమాలకు పెద్ద దెబ్బే. అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలోనూ విడుదల చేస్తున్నారు. దీంతో మూడు భాషల్లోనూ తెలుగు సినిమాలకు గట్టి దెబ్బ అనే చెప్పాలి. అజిత్‌ మామూలుహీరో కాదు. అక్కడ పెద్ద సూపర్‌ స్టార్‌. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. ఆయన సినిమా అంటే కోలీవుడ్‌ మొత్తం బ్లాక్‌ అయిపోవాల్సిందే. అలాగే హిందీలోనూ ఆయనకు మంచి మార్కెట్‌ ఉంది. తెలుగులో అజిత్‌ చిత్రాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`కు పెద్ద థ్రెట్‌ ఉండబోతుందని చెప్పొచ్చు. 

46

అజిత్‌ సినిమాని సంక్రాంతి బరిలోకి దించడంపై నిర్మాత బోనీ కపూర్‌ సూపర్‌ స్కెచ్‌ ఉందని అంటున్నారు. నిజానికి ఈ ఏడాది దసరాకి బోనీ కపూర్‌ నిర్మిస్తున్న `మైదాన్‌` చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ దాన్ని లెక్క చేయకుండా రాజమౌళి కూడా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా దసరాకి అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి షాక్‌ ఇచ్చారు. ఆ సమయంలో బోనీ కపూర్‌ సీరియస్‌ అయ్యాడు. ఇది వెన్నుపోటుగా వర్ణించారు. విలువలు తప్పి ప్రవర్తించడమే అవుతుందన్నారు. ఆ సందర్భం సెకండ్‌ వేవ్‌ కరోనా కారణంగా మిస్‌ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్‌ చేశారు. 

56

అయితే ఈ సంక్రాంతికి రాజమౌళికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బోనీ కపూర్. అందుకే తన సినిమాని మూడు భాషల్లో సంక్రాంతికే రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఏ సినిమాలు తగ్గినా, బోనీ కపూర్‌ తగ్గరు, అజిత్‌ అస్సలే తగ్గరు. దీంతో సంక్రాంతికి వార్‌ భీభత్సంగా ఉండబోతుందని చెప్పొచ్చు. 

66

 ఇప్పటికే ఏపీలో టికెట్‌ రేట్ల విషయంలో ఇబ్బంది నెలకొంది. చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఓ వైపు టికెట్ల రేట్లకి సంబంధించిన సమస్యతోపాటు ఇప్పుడు ఆశలు పెట్టుకున్న తమిళం, బాలీవుడ్‌లో కూడా ఇబ్బంది ఎదదురైతే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`ల కలెక్షన్లకి పెద్ద గండికొట్టినట్టవుతుంది మరి ఈ వార్‌ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories