సుశాంత్ ఎందుకిలా చేశాడు..? స్క్రీన్‌ `ధోని` మరణానికి కారణం అదేనా?

First Published Jun 14, 2020, 4:17 PM IST

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్‌ మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో భవిషత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంపై సినీ ప్రముఖులతో పాటు యావత్‌ దేశ ప్రజానీకం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.

బుల్లి తెర నుంచి వెండితెర మీద అడుగు పెట్టిన సుశాంత్ ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకపోయినా తన స్వశక్తితో హీరోగా ఎదిగిన నటుడు సుశాంత్‌. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న యువ నటుడు వెండితెర మీద కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు.
undefined
అయితే ఇంతటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. గతంలో 2018లో కెరీర్‌ పరంగా సమస్యలు రావటంతో ఆ సమయంలో కూడా సుశాంత్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా సన్నిహితులు చెబుతున్నారు.
undefined
సుశాంత్ కుటుంబమంతా పాట్నాలో ఉంటుంది. 2002లో తల్లి మరణం సుశాంత్ ఎంతగానో బాధించింది, ఇప్పటికీ తల్లి గుర్తు వచ్చినప్పుడు సుశాంత్ ఎమోషనల్ అవుతుంటాడని ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లు చెపుతుంటారు. సుశాంత్ తన చివరి సోషల్ మీడియా పోస్ట్ కూడా తల్లి గురించే చేయటం విశేషం. లాక్‌ డౌన్‌ సమయంలో మానసిక ఒత్తిడితో పాటు ఒంటరితనం కారణంగా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.
undefined
గతంలో మానసిక ఒత్తడి సుశాంత్ చికిత్స కూడా తీసుకున్నాడంటున్నారు సన్నిహితులు. అయితే ప్రస్తుతం పరిస్థితిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. శనివారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు వీడియో కాల్ ద్వారా మాట్లాడిన సుశాంత్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడంటున్నారు. కానీ 24 గంటల్లో ఇంటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.
undefined
అదే సమయంలో నాలుగు రోజుల క్రితం చనిపోయిన సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్‌, దిశా సలియాన్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 10న తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది దిశ. అయితే దిశ మరణానికి, సుశాంత్ ఆత్మహత్యకు ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
undefined
అదే సమయంలో కెరీర్‌ పరంగా పెద్దగా సక్సెస్‌లు లేకపోవటం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ధోని సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్ కు ఆ తరువాత ఒక్క హిట్ కూడా లేదు. చిచోరే సినిమా సక్సెస్‌ అయినా అది సుశాంత్ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు, దీంతో కెరీర్‌ సరిగా లేదన్న మానసిక ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.
undefined
click me!