ముచ్చటగా ముగ్గురితో సుస్మితా సేన్ రొమాంటిక్ లవ్ స్టోరీ, పెళ్ళికి మాత్రం దూరంగా బాలీవుడ్ హీరోయిన్

Published : Jul 15, 2022, 09:20 AM IST

ఎట్టకేలకు ముచ్చటగా మూడోసారి ప్రేమలోపడింది బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్.మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తోంది. 50 ఏళ్లకునాలుగు అడుగుల దూరంలో ఉన్న సుస్మిత సేన్ లైఫ్ లో మూడు ప్రేమ కథలు ఉన్నా..  పెళ్లి మాత్ర కలగానే మిగిలిపోయింది.

PREV
17
ముచ్చటగా  ముగ్గురితో సుస్మితా సేన్ రొమాంటిక్ లవ్ స్టోరీ, పెళ్ళికి మాత్రం దూరంగా బాలీవుడ్ హీరోయిన్

మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్... బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ సుస్మితా సేన్  మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ఆమె డేటింగ్‌ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో స్వయంగా లలిత్ మోడీ వెల్లడించారు. అంతే కాదు సుస్మితా తన లైఫ్ పార్ట్ నర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ... వీరిద్దరు క్లోజ్ గా ఉన్న పిక్స్ ను శేర్ చేశాడు. 
 

27

ఈ సీనియర్ స్టార్ జంట మాల్దీవుల్లో ఫుల్ గా షికార్లు కొట్టారు. ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం... లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాను అంటూ లలిత్ మోదీ పోస్ట్ చేశారు. సుస్మితతో  న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నందకు  చాలా సంతోషంగా ఉంది అని పోస్ట్ లో  రాసుకొచ్చాడు లలిత్ మోదీ. 
 

37

ఈ పోస్ట్ తో నెటిజన్లు వెంటనే స్పందించడం మొదలెట్టారు.  వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకుని వరుసగా శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో కాసేపటికే లలిత్ మోదీ మాట మార్చారు. తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని,  అని చెప్పుకొచ్చాడు.

47

 ప్రస్తుతం లలిత్ మోదీతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ నటి సుస్మితా.. గతంలో రెండు సార్లు ఇద్దరు ప్రేమికులతో బ్రేకప్ చెప్పింది. మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ఘాటుగా  ప్రేమాయణం నడిపింది సుస్మితా సేన్‌ . వీరిద్దరూ  కలిసి సహజీవనం కూడా చేశారు. కానీ వీరిమధ్య  సుస్మితా బిజీ షెడ్యూల్‌ చిచ్చు పెట్టింది. 
 

57

ఆ టైమ్ లో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న సుస్మితా వల్ల  వసీమ్‌ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు వీరి మధ్య అనుమానాలు, అపార్థాలు పెరిగిపోవడంతో.. వీరి  అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్‌ అయింది. సుస్మితకు వసీమ్ పై చిరాకు రావడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. 
 

67

ఇక కొన్నాళ్లు ఖాళీగా ఉన్న సుస్మితా సేన్  ఆ తర్వాత.. ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు అయిన రోహమన్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగింది.  కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.  డిసెంబర్ 3న తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు.
 

77

అయితే విచిత్రం ఏంటీ అంటే.. బ్రేకప్ అని అనౌన్స్ చేయడం వల్లే వీరిద్దరి  డేటింగ్ రిలేషన్ షిప్  గురించి తెలిసింది. అంతే కాదు రొహ్మన్ తో ప్రేమ వ్యవహారం మాత్రమే కాదు.. అతనితో  సహజీవనం కూడా చేసింది సుస్మితా.  సుస్మితా సేన్, రొహ్మన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఫారెన్ వెకేషన్స్ లో ఫుల్ గా  ఎంజాయ్ చేశారు. కానీ మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇలా మూడు ప్రేమ కథలు నడిపిన సుస్మితా.. ఇప్పటివరకూ పెళ్ళి చేసుకోలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories