షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువెంతో తెలుసా? అన్ని వేల కోట్లా? కార్లు, విల్లాలు, బిజినెస్ లు...

బాలీవుడ్ కింగ్ ఖాన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఎన్ని వేల కోట్లు సంపాదించారో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.  ఆయన కూడబెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 
 

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటున్న ఆయనకు దేశ వ్యాప్తంగానూ, వరల్డ్ వైడ్ గానూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐదు పదుల వయస్సు దాటినా భారీ బ్లాక్ బాస్టర్లతో దుమ్ములేపుతున్నారు. 

రేపు (సెప్టెంబర్ 7న) షారుఖ్ నటించి భారీ యాక్షన్ ఫిల్మ్ ‘జవాన్’ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా షారుఖ్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వైరల్ గా మారాయి. అందులో ఆయన కూడబెట్టిన ఆస్తుల విలువల హాట్ టాపిక్ గ్గా మారింది. 
 


2023లోనే అందిన ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ నెట్ వర్త్  వేల కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. IPL జట్టును కలిగి ఉండటం, విలాసవంతమైన కార్లు, విల్లాలు, వార్షిక ఆదాయం,  తదితర బిజినెస్ లతో వచ్చే ఇన్ కమ్ వివరాలు చూస్తే షాకింగ్ గా ఉంది. 
 

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ప్రతి సినిమాకు రూ. 100 నుంచి రూ.150 కోట్లు పారితోషికం అందుకుంటాడు. ఇదిగాక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మరియు వివిధ వ్యాపార సంస్థల నుండి మరో రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇలా వార్షికాదాయం మొత్తంగా రూ. 280 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

అలాగే షారూఖ్ ఖాన్ సినీ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా కూడా డబ్బు కూడబెట్టారు. ఈ సంస్థను ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటారు. షారుఖ్ ఖాన్ ఆర్థిక ఎదుగుదలలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించిందని చెబుతుంటారు. ఈ వెంచర్ నుంచి వార్షిక ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందంట. 
 

షారుఖ్ ఖాన్ కు IPL జట్టు: కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ జట్టును సొంతం చేసుకోవడం.. ద్వారా కూడా భారీ స్థాయిలో ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. ఇక కింగ్ ఖాన్ దగ్గరగా లగ్జర్లీ కార్లు కూడా ున్నాయి. బుగాట్టి వేరాన్, బెంట్లీ కాంటినెంటల్ GT, రీగల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే వంటి బ్రాండ్ లకు సంబంధించిన కార్లు ఉన్నాయి. వీటి విలువ విలువ 31 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 
 

మరీ ముఖ్యంగా షారుఖ్ కు దుబాయ్ లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అలాగే అమెరికాలోనూ అత్యంత ఖరీదైనా విల్లా కూడా ఉంది. ఆయా చోట్లా మరిన్ని ఆస్తులు ఉన్నాయి. అలాగే రూ.4 కోట్ల విలువగల వ్యానిటీ కారును కలిగి ఉన్నాడు. షూట్‌ల సమయంలో దాన్ని ఉపయోగిస్తుంటారు. ఇలా ఆస్తుల విలవ మొత్తంగా రూ. 6,300 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 
 

ఇక చివరిగా ‘పఠాన్’ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశారు. నయనతారా హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపుదిద్దుకుంది. రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. 

Latest Videos

click me!