ట్రెడిషనల్‌ డ్రెస్‌లో నయా లుక్ తో ఊరిస్తున్న హేబా పటేల్‌ అందం.. నిండుగా ఉన్నా వేడి మాత్రం తగ్గలేదుగా!

Published : Sep 06, 2023, 04:59 PM IST

తెలుగు తెర కుమారి హేబా పటేల్‌.. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో మెరిసింది. ఇప్పుడు బలమైన పాత్రలతో అలరిస్తుంది. అప్పుడు బోల్డ్ గా ఇప్పుడు స్ట్రాంగ్‌గా మెప్పిస్తుంది. తనలోని వేరియేషన్స్ చూపిస్తుంది.   

PREV
17
ట్రెడిషనల్‌ డ్రెస్‌లో నయా లుక్ తో ఊరిస్తున్న హేబా పటేల్‌ అందం.. నిండుగా ఉన్నా వేడి మాత్రం తగ్గలేదుగా!

హేబా పటేల్‌(Hebah Patel) చాలా మారిపోయింది. ఆమె అందాల ఆరబోస్తే కొన్నాళ్లకే పరిమితమని తెలుసుకుంది. కంటెంట్‌తో కొట్టాలనుకుంటున్నారు. పైగా కొత్త భామల జోరు ఊపందుకోవడంతో గ్లామర్‌ కాదు, బలమైన కంటెంట్‌ సినిమాలతో మెప్పించాలని నిర్ణయించుకుంది. అలాంటి చిత్రాలతోనే అలరిస్తుంది. 
 

27

ఇప్పుడు గ్లామర్‌ని కేవలం ఇంటర్నెట్‌కి పరిమితం చేస్తుంది Hebah Patel. వెండితెరపై మాత్రం నో గ్లామర్‌ అంటుంది. డీ గ్లామర్‌కైనా సిద్ధపడుతుంది. తనలోని అసలు టాలెంట్‌ చూపిస్తుంది. నెట్టింట అందాల విందు చేస్తూ దుమారం రేపుతుంది. హద్దులు చెరిపేస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.
 

37

సోషల్‌ మీడియాలో అందాల విందు చేసే ఈ భామ ఇప్పుడు నిండైన దుస్తుల్లో మెరిసింది. సంప్రాదాయాలకు పెద్దపీఠ వేసింది. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. స్వతహాగా హాట్ గా ఉండే హేబా పటేల్‌.. ఈ ట్రెడిషనల్‌ డ్రెస్‌లోనూ అంతే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె హాట్‌ నెస్‌ పెరిగింది. 

47

హేబా పటేల్‌ `అలా ఎలా` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కూల్‌ లవ్‌ స్టోరీగా, ఓ ఫ్రెష్‌ లవ్‌ స్టోరీగా ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో హేబా పటేల్ కి మంచి పేరొచ్చింది. దీంతో వెంటనే ఈ బ్యూటీ `కుమారి 21ఎఫ్‌` చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 
 

57

ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. టీనేజ్‌ లవ్‌ స్టోరీస్‌లో ఓ నయా పంథాకి శ్రీకారం చుట్టుంది. టాలీవుడ్‌లో ఇదొక కొత్త పంథాని పరిచయం చేసింది. అందరి చూపులు తిప్పుకుంది. అంతేకాదు ఇందులో బోల్డ్ గా నటించిన హేబా పటేల్‌ మరింత పాపులర్‌ అయ్యింది. 

67

అయితే ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా అలాంటి బోల్డ్ రోల్సే వచ్చాయి. రెండు మూడు సినిమాలు చేసింది. తీరిక లేకుండా గడిపింది. దీంతో మధ్యలో గ్యాప్‌ తీసుకుంది. ఆ గ్యాప్‌ ఈ బ్యూటీ కెరీర్‌కి పెద్ద దెబ్బలా మారిపోయింది. దాన్నుంచి మళ్లీ రావడానికి చాలా టైమ్‌ పట్టింది. ఇటీవల నెమ్మదిగా అవకాశాలను దక్కించుకుంటూ మెప్పిస్తుంది. 
 

77

అయితే గతంలో మాదిరిగా బోల్డ్ రోల్స్, గ్లామర్‌ పాత్రలు కాకుండా నటనకు స్కోప్‌ ఉన్న రోల్స్ చేస్తూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులున్నాయి. మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తుందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories