టాలీవుడ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు వాడే వస్తువులపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సోషల్ మీడియా జనాలు. ఈమధ్య సెలబ్రిటీల ఫ్యాషన్స్ పై నెటిజన్లకు ఇంట్రెసట్ పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర్నుంచి వాచ్, షూస్, గ్లాసెస్ ఇలా అన్నింటి గురించి, వాటి ధరల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా.. ప్రభాస్ కార్లు.., మహేష్ బాబు షర్ట్స్.., ఎన్టీఆర్ వాచ్ లు.. అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి, వాటి కాస్ట్ గురించి సోషల్ మీడియాలో హడావిడి జరుగుతూనే ఉంది.