#Vyoohamreview:రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమా రివ్యూ

First Published Mar 2, 2024, 3:22 PM IST

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు సినిమా ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. 

ఇది ఎలక్షన్ సీజన్ . వరస పెట్టి పొలిటికల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మొత్త యాత్ర2, రాజధాని ఫైల్స్,  ఇప్పుడు ఇదిగో ఈ వ్యూహం. అసలు వీటిన్నటికి కన్నా ముందే ఈ సినిమా వస్తుందని అందరూ భావించారు. అయితే రకరకాల వివాదాలు, కోర్టు కేసులతో ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లను పలకరించగలగింది. ఈ సినిమా ఏ మేరకు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో కానీ రిలీజ్ కు ముందు కోర్టుకు ఎక్కడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. బజ్ క్రియేట్ అయ్యింది. సెన్సార్‌ బోర్డుతో పాటు కోర్డు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యూహం రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది...అసలు దర్శకుడు చెప్దామనుకున్నది ఏమిటి..అసలు కోర్టుకు వెళ్లి ఆపాలనేంత విషయం సినిమాలో ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్

ఆంధ్రాలో వైఎస్సార్ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పరిస్దితుల్లో ప్రతిపక్షానికి చెందిన  తారా ఇంద్రబాబు నాయుడు  (ధనుంజయ్‌ ప్రభునే) ఆనందంతో తనే తర్వాత ముఖ్యమంత్రి అవ్వచ్చు అంటూ సెలబ్రేట్ చేసుకుంటూంటారు. మరో ప్రక్క  కాంగ్రేస్ అధినాయకత్వం .. పరామర్శకు వచ్చి  తనకు లొంగి ఉండాలి ఆయన కుమారుడు అన్నట్లు బిహేవ్ చేస్తుంది.అంతే కాకుండా కాశయ్యను ముఖ్యమంత్రి చేస్తారు.  ఈ క్రమంలో కాంగ్రేస్ అధినాయకత్వానికి లొంగని  మదన్ (అజ్మల్) ఓదార్పు యాత్ర మొదలెడతారు. ఆ యాత్రకు చాలా పేరు రావటంతో తట్టుకోలేకపోతారు. వార్నింగ్ లు ఇస్తారు. అంతేకాకుండా మదన్ ని అక్రమాస్దుల కేసులో ఇరికించి జైలుకు పంపుతారు. ఆ తర్వాత బెయిల్ పై జైలు నుంచి వచ్చిన మదన్ కు సానుభూతి వస్తోందని ఇంద్రబాబు ..తన కుయుక్తులను బయిటకు తీస్తాడు. అంతేకాకుండా అప్పుడే పార్టీ పెట్టిన  శ్రవణ్ కళ్యాణ్ మద్దతు తీసుకుంటాడు. మదన్ ని ఓడిస్తారు. అక్కడ నుంచి మదన్ మళ్లీ ఎలా పడిలేచిన కెరటంలా జనాలను పోగేసుకుని కుయుక్తులను ఛేదించి ఏపీ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యాడనేది ఈ చిత్రం కథ. మధ్యలో  మదన్ కి అతని భార్య వియస్ మాలతి రెడ్డి (మానస రాధా కృష్ణన్) ఎలాంటి సపోర్ట్ అందించింది అనే ప్రస్తావన సైతం చేసారు. 


ఎనాలసిస్ ..

ఇదో పొలిటికల్ ప్రాపగాండా సినిమా అని అందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ టైమ్ లో ఇలాంటి సినిమాలు రావటంలో వింతకూడా ఏమీలేదు. అయితే నిజ జీవిత పాత్రలనే కాస్త పేర్లు మార్చి అవే గెటప్స్ తో దింపి సినిమా తీసారు రామ్ గోపాల్ వర్మ. నిజ జీవిత కథలు తీయటం వర్మకు కొత్తకాదు కానీ ఇలాంటి రాజకీయ ప్రాపగాండా సినిమాలు స్దాయికి వచ్చేయటం మాత్రం బాధ కలిగిస్తుంది. ఓ టైమ్ లో దేశం మొత్తాన్ని తన సినిమాలతో మాట్లాడుకునేలా చేసిన వర్మ ..ఇలా పార్టీ కోసం సినిమా తీసి వదలటం ఆయనకు సమంజసం అనిపించి ఉండవచ్చు. కానీ ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రం అనే పేరు పడగానే మనకే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఆయనకు సొంత లాజిక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ప్రక్కన పెడితే... వ్యూహం సినిమాలో నిజానికి ప్రధాన పాత్ర మదన్  వ్యూహాలు  కన్నా విలన్స్ గా చూపెట్టే వారి వ్యూహాలే ఉంటాయి. అలాగే ఈ సినిమా జగన్ ని ఉద్దేశించి చేసిన ఈవెంట్ బయోపిక్ లాంటిది కాబట్టి ఆయన్ని హైలైట్ చేస్తూ  ఎలివేషన్స్ ఉన్నాయి. 


అలాగే రెగ్యులర్ సినిమా ఫార్మెట్ మాదిరిగానే ...హీరోలా మదన్ పాత్రను చూపెట్టడం. అతన్ని  ఎదగనీయకుండా చేసిన  వ్యక్తులను విలన్స్ గా చూపిస్తూ సినిమా నడిపించారు.  వైసీపీకి శత్రువుగా భావించే టీడీపీ, జనసేన పార్టీలను.. ఆ పార్టీనాయకులను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్దమవుతుంది. రెండు ఆధిపత్య రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతున్న రాష్ట్రం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అయితే ఇంద్రబాబు కొడుకు పాత్రను ,శ్రవణ్ కళ్యాణ్ పాత్రను కామెడీ చేసేసారు. ఎక్కువగా సెటైర్స్ పేల్చారు. సినిమాలో ఎక్కడా ఇంద్రబాబు కొడుకు ని డైరక్ట్ గా చూపకండా.. ఎప్పుడూ తింటూ ఉంటారన్నట్టు చూపించారు. అంతా బాగానే ఉన్నా పాటల్లోనూ సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత ప్రీ క్లైమాక్స్ దాకా సినిమా బాగా స్లోగా నడుస్తుంది.అడుగు అడుగుకి  పాటలు ఓ టైమ్ లో విసిగిస్తాయి. పార్టీ అభిమానులు కోసం పెట్టి ఉండవచ్చు. వారికి నచ్చుతాయేమో. దాదాపు సినిమాలో విషయం అందరికీ తెలిసిందే కాబట్టి పెద్ద ఎగ్జైమెంట్ తో మాత్రం సినిమా ఉండదు. అలా నడుస్తూంటుంది. 

టెక్నికల్ గా చూస్తే ...

డైరక్టర్ గా వర్మ ఎప్పుడూ మంచి స్టాండర్ట్సే మెంయింటన్ చేస్తూ వస్తారు. అయితే ఈ సినిమాకు ఇది చాలు అని లిమిటేషన్ పెట్టుకున్నట్లున్నారు. దాంతో చాలా చోట్ల జస్ట్ ఓకే అన్నట్లుగా విజువల్స్ వస్తూ పోతూంటాయి. ఇక ఎందుకున్న ఈ కథే సోసోగా ఉంటూ తెలిసిందే కాబట్టి స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా చేసుకోవాల్సింది.అది చేయలేదు. ఆయన విన్నవి, ఊహించుకున్నవి సీన్స్ గా రాసుకుని తెరకెక్కించినట్లున్నారు. . సంగీత దర్శకుడు ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ  న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ ఇంకాస్త ల్యాగ్ లు తగ్గించి ఉండి కథ పరుగెట్టిస్తే బాగుండేది. ఈ చిత్ర నిర్మాత రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్  బాగానే ఉన్నాయి.
 

ప్లస్ లు

ముఖ్యమంత్రి జగన్ హావభావాలను యాజటీజ్ పట్టుకుని ప్లే చేసిన అజ్మల్
ఇంద్రబాబు పాత్రలో నటించిన నటుడు లుక్ 
కొన్ని సింబాలిక్ షాట్స్

మైనస్ లు ..

స్లో నేరేషన్ 
విసిగించే పాటలు
కొన్ని రొటీన్ గా అనిపించే బోరింగ్ సీన్స్ 

Vyooham

ఫైనల్ థాట్..

ఇది పొలిటికల్ ప్రాపగాండా చిత్రం కాబట్టి అందరికీ నచ్చే అవకాసం ఉండదు. అలాగే కొందరికి విపరీతంగా నచ్చవచ్చు. అది తమ తమ రాజకీయ అభిప్రాయాలను  బట్టి ఉంటుంది. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5


నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
విడుదల తేది: మార్చి 2, 2024

click me!