5 నెలల గర్భం పోగొట్టుకున్నాను.. రాణీ ముఖర్జీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

Published : Aug 12, 2023, 05:06 PM IST

తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి వెల్లడించారు బాలీవుడు సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె వాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

PREV
16
5 నెలల గర్భం పోగొట్టుకున్నాను.. రాణీ ముఖర్జీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ ను ఒకప్పుడు హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది సీనియర్ తార రాణీ ముఖర్జీ. ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూ.. సీనియర్ తారగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది బ్యూటి. రాణీ బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసినా.. ఆమెకు సౌత్ నుంచి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటికీ ఆమెను అభిమానించి ప్రేమిస్తుంటారు సినిమా లవర్స్. 

26

ఇక  రాణి ముఖర్జీ రీసెంట్ గా  మెసేజ్ చటర్జీ వర్సెస్ నార్వే అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. తాజాతా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాకు సబంధించిన ప్రమోషన్స్ తో పాటు.. ఈమూవీ విశేషాలు వివరిస్తూ.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ  తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెపుతూ ఎమోషనల్ అయ్యారు. 
 

36

మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే' సినిమా ష‌ూటింగ్ కు ముందు తన లైఫ్ లో అనుభవించిన ఓ భయంకరమైన  విషాద సంఘటన గురించి పంచుకున్నారు రాణీ ముఖర్జీ.  ఇటీవల జరిగిన 'ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023' లో పాల్గొన్న రాణి ముఖర్జీ, ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో తాను గర్భవతి అయిన ఐదు నెలలకే తన రెండవ బిడ్డను  కోల్పోయినట్టు వెల్లడించారు. 

46

ఇకఇదే విషయాన్ని మరోసారి  తాజా ఇంటర్వ్యూలో  కూడా గుర్తుచేసుకున్ని బాధపడ్డారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. మొదటిసారి నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయం గురించి బయటికి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేటి ప్రపంచంలో మీ జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క అంశం బయట పెద్ద చర్చకు దారి తీస్తుంది. నేను ఓ సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడను. కానీ ఈ సినిమాకు సంబంధించి వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను అన్నారు. 

56

రాణీ మాట్లాడుతూ.. అది 2020 కోవిడ్ సమయం. ఆ సంవత్సరం చివర్లో నేను రెండోసారి ప్రెగ్నంట్ అయ్యాను.. కాని దురదృష్టవశాత్తు నేను గర్భవతైన ఐదు నెలలకే నా బిడ్డను కోల్పోయాను అని అన్నారు రాణీ ముఖర్జీ. అదే సమయంలో ఈసినిమా కథ నాదగ్గరకు వచ్చింది. మన జీవితంలో జరిగిన సంఘటనకు సబంధం ఉన్న కథ.. కాబట్టి వదులుకో కూడదు అని అనుకున్నాను. వెంటనే ఒప్పుకున్నాను అన్నారు రాణీ. 
 

66

ఇక రాణీ ముఖర్జీ వ్యాక్తి గత జీవితం చూసుకుంటే.. 2014లో పెళ్ళి చేసుకున్ననారు.  రాణి ముఖర్జీ నిర్మాత మరియు దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాను పెళ్శాడగా.. వారికి ఏడాది తరువాత  ఓ పాప జన్మించింది. ఆమె పేరు ఆదిరా.  ఇక రాణీ నటించిన మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే' సినిమా తన పిల్లల కోసం రాష్ట్రంతో పోరాడే తల్లి  కథతో తెరకెక్కింది. వీరమాతగా రాణీ ఈ పాత్రలో జీవించారు. ఆశీమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories