ప్రేమ పెళ్ళి ఏది కలిసిరాలేదు.. బాలీవుడ్ నటి రేఖ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్

Mahesh JujjuriPublished : Jul 21, 2023 8:00 PM

స్టార్ హీరోయిన్ గా  బాలీవుడ్ లో వెలుగు వెలిగింది అందాల అభినయానికి నిలువెత్తు నిదర్శనం రేఖ.  సౌత్ నుంచి వెళ్ళి.. నార్త్  స్క్రీన్ ను ఒక ఊపు ఊపింది సీనియర్ తార. ఎన్నో సూపర్ హిట్ ప్రేమ కథల్లో నటించిన రేఖ నిజ జీవితంలో మాత్రం అన్నీ ఫెయిల్యూర్ ప్రేమ కథలే. 

16
ప్రేమ పెళ్ళి ఏది కలిసిరాలేదు.. బాలీవుడ్ నటి రేఖ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్
Rekha

దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో వెలుగు వెలుగొందింది రేఖ. ఆమె  జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి. కాని అన్ని ఫెయిల్యూర్ స్టోరీసే.. ఆమె మొదటి ప్రేమ అమితాబ్ తో.. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్ బచ్చన్ ను ప్రేమించింది రేఖ. కానీ జయాబచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్ స్టాప్ పడింది.

26
Rekha

 ఆతరువాత  స్టార్ క్రికెటర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ ఆ మధ్య ఓ పేపర్ క్లిప్ బాగా వైరలయింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారనుకునేలోపే విడిపోయారనిఅందులో రాసుకొచ్చారు.

36

అయితే ఆమె ఆతరువాత వినోడ్ మెహ్రాను సీక్రేట్ గా పెళ్లాడిందట. అప్పట్లో ఆమె నుదుట సిందూరం పెట్టుకోవడంతో..అందరికి అనుమానం వచ్చి ఆరా తీస్తే తెలిసిన విషయం ఇది. అయితే వీరిద్దరికి కొద్ది కాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. ఇక ఆతరువాత ఆమె కొన్ని పార్టీలలో పరిచయం అయిన వ్యాపార వేత్త అయిన ముఖేష్ అగర్వాల్ ను పెళ్ళాడింది. ఓ పార్టీలో ముఖేష్ స్వాయంగా మనం పెళ్ళి చేసుకుందాం అన్నాడట. దాంతో ఆమె ఒకే అనేసింది. 

46

విచిత్రం ఏంటీ అంటే.. వీరి పెళ్ళి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.. రేఖను పెళ్ళాడిని అతి కొద్దికాలానికే .. ముఖేష్ రేఖ చున్నీతో ఉరి వేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. అప్పట్లో ఈ విషయంలో రేఖపై విమర్శలు కూడా వచ్చాయి. ఆమెసినిమా పోస్టర్లపై పేడ కొట్టారు ఆడియన్స్.. 
 

56

అయితే రేఖజీవితంలో ఆమె సెక్రట్రీ ఫర్జానాదే అధికారం అని.. ఎన్నో గాసిప్స్ వచ్చాయి. ఆమె ఏది చెపితే అది రేఖ చేస్తుందని. ఆమె చేతిలో బొమ్మగా మారిందంటూ... రకరకాల వివాదాలు వచ్చాయి. రేఖ దాదాపు 30 ఏళ్ళు తన సహా యకురాలు ఏది చెపితే అది చేసినట్టు.. రేఖ జీవిత చరిత్ర లో కూడా ఇన్ డైరెక్ట్ గా రాయబడింది. ఒక దశలో రేఖ తన సహాయకురాలితో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. 

66

అయితే రేఖ మాతరం ఫర్జానా ను తన సోదరిలా భావిస్తానంటూ చెప్పడం కొసమెరుపు ఏది ఏమైతేనేం.. కొన్నిదశాబ్ధాలు బాలీవుడ్ తెరను ఏలిన రేఖ.. తన సొంత జీవితాన్ని మాత్రం సక్రమంగా మలుచుకోలేకపోయారు. ఆమె జీవితంలో ప్రతీ లవ్ స్టోరీ ఫేయిల్యూర్ స్టోరీగానే మిగిలిపోయింది.  
 

Read more Photos on
click me!