లెజెండరీ నటి రేఖకి వేధింపులు తప్పలేదు.. ఆ నటుడు బలవంతంగా ముద్దు పెట్టాడట

Published : Oct 14, 2020, 09:17 PM IST

బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరోయిన్‌ రేఖ. బాలీవుడ్‌ని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు శాషించిన హీరోయిన్‌. రొమాంటిక్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ అందాల నటి కెరీర్‌ ప్రారంభంలో వేధింపులు ఎదుర్కొందట. 

PREV
17
లెజెండరీ నటి రేఖకి వేధింపులు తప్పలేదు.. ఆ నటుడు బలవంతంగా ముద్దు పెట్టాడట

తమిళ అగ్ర కథానాయకుడు జెమినీ గణేషన్‌, పుష్పవల్లిల ముద్దుల తనయగా బాలనటిగా తెలుగు సినిమాలతో తెరంగేట్రం చేసిన రేఖ అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగింది. 1970, 80లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. అమితాబ్‌ బచ్చన్‌ వంటి అగ్ర హీరోలందరితోనూ రొమాన్స్ చేసింది. 

27

కెరీర్‌ ప్రారంభంలో రేఖకి కూడా వేధింపులు తప్పలేదట. తాను 15ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ల బెంగాలీ నటుడు బిస్వాజీత్‌ తనని బలవంతంగా ముద్దుపెట్టాడట. తాజాగా ఈ విషయం బయటపడింది.

37

1969లో `అంజనా సఫర్‌` చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో బిస్వాజీత్‌, రేఖ హీరోహీరోయిన్లుగా నటించారు. షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో బిస్వాజీత్‌.. రేఖని ఏకంగా ఐదు నిమిషాల పాటు ముద్దు పెట్టాడట. 

47

తాజాగా రైటర్ యాసీర్‌ ఉస్మాన్‌ .. రేఖపై రాసిన `రేఖః ది అన్‌టోల్డ్ స్టోరీ` పుస్తకంలో రాసుకొచ్చారు. ఆ సమయంలో రేఖ కళ్ళు మూసుకుని కన్నీళ్ళు పెట్టుకుందట. చిత్ర బృందం దాన్ని ఆపకపోగా, పైగా కెమెరాని క్లోజ్‌లో పెట్టి ఈలలు వేశారట. 

57

ఇంకా ఆ పుస్తకంలోని విశేషాలు చూస్తే, ముంబయిలోని మెహబూబ్‌ స్టూడియోలో `అంజనా  సఫర్‌` షూటింగ్‌ జరుగుతోంది. అది ఫస్ట్ షెడ్యూల్‌. చిత్ర దర్శకుడు రాజా నవాతే, మరో దర్శకుడు కుల్‌జీత్‌ పాల్‌, హీరో బిస్వాజీత్‌ ఓ ప్లానింగ్‌ ప్రకారం ఇలా చేయాలని నిర్ణయించుకున్నారట. 

67

దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే బిస్వాజీత్‌ ఇలా ముద్దుతో రెచ్చిపోయాడట. కానీ తాను ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కట్‌ చెప్పేంత వరకు అలానే ఉండిపోయిందట. ఓ రకంగా నిస్సాయతగా ఉండిపోయిందట. ఆ ఘటన రేఖని షాక్‌కి గురి చేసిందట. 

77

ఆ సమయంలో రేఖ.. హీరో బిస్వాజీత్‌ని నిందించినప్పటికీ, ఆ ప్లాన్‌ మొత్తం దర్శకుడిదే అని చెప్పి తప్పించుకున్నారట.  సినిమా కోసమే ఇలా చేశామని తప్పించుకున్నారని తెలిసింది. అసలు విషయం తెలిసి రేఖా ఖంగుతిన్నది. మొత్తానికి ఓ లెజెండ్‌ కూతురైనా వైధింపులు తప్పలేదని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories