ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , సావిత్రి లాంటి దిగ్గజ నటీనటులు తమ నటనతో తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున కమర్షియల్ గా తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.