డేటింగ్ చేద్దామంటూ..కాళ్ళా వేళ్ళా పడ్డాడు.. రణ్ బీర్ పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..

Published : Aug 01, 2023, 07:37 PM IST

మరోసారి వరుస వివాదాలతో హాట్ టాపిక్ గామారింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఈసారి కూడా స్టార్ హీరోలను .. స్టార్ డైరెక్టర్లను టార్గెట్ చేసి.. బాలీవుడ్ లో భారీ బ్లాస్టింగ్స్ ప్లాన్ చేసింది. 

PREV
16
డేటింగ్ చేద్దామంటూ..కాళ్ళా వేళ్ళా పడ్డాడు.. రణ్ బీర్ పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Kangana Ranaut Karan Johar

భారీ వివాదాలతో బాలీవుడ్ లో మరో బాంబ్ పేల్చింది కంగనా రనౌత్. స్టార్ నిర్మాత, స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ తో పాటు.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను కూడా టార్గెట్ చేసింది. తూటాలాంటి మాటలతో.. బాలీవుడ్ లో అలజడి సృష్టించింది. పరోక్షంగా ప్రత్యక్షంగా వార్ మొదలెట్టింది బ్యూటీ. 

26
Photo Courtesy: Instagram

ఈ మధ్యే మాఫియా సూపర్‌ స్టార్‌ అంటూ.. రణ్‌బీర్‌ కపూర్‌పై పరోక్షంగా వివాదాస్పద కామెంట్‌ చేసి సంచలనం అయింది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఇక ఇప్పుడు మరోసారి రణ్‌బీర్‌ను టార్గెట్‌ చేసింది. మాఫియా ప్లే బాయ్‌ పెళ్లి ఒక బూటకం అని చెప్పింది. అంతే కాదు నా విషయంలో కూడా అతను తప్పుగా ప్రవర్తించాడంటూ చెప్పుకొచ్చింది కంగనా. 

36

అంతేకాకుండా ఆ ప్లే బాయ్‌ హీరో తనతో డేటింగ్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడని, తాను ఒప్పుకుంటే ట్రయింగిల్‌ డేటింగ్‌ చేయడానికి ఆ హీరో రెడీ అయ్యాడని కంగనా వెల్లడించింది. తాను ఒప్పుకుంటే తన జీవితం కూడా అలానే చేసేవాడంటుంది బాలీవుడ్ బ్యూటీ.  

46
Kangana Ranaut

అయితే అతనితో డేటింగ్ కు తాను ఒప్పుకోకపోవడంతో.. తనపై కక్ష్య కట్టాడని.. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన తనను ఇబ్బందిపెట్టాలని చూసినట్టు చెప్పుకోచ్చింది బ్యూటీ. అంతే కాదు కంగనా క్వీన్‌ చేస్తున్న టైమ్‌లో ఆ హీరో తన డేటా మొత్తం సేకరించాడని, తను ఎక్కవడికి వెళ్తే అక్కడికి దర్శనం ఇచ్చేశాడని పేర్కొంది. 
 

56

అంతే కాదు ఈ విషయంలో ఒ ఎక్జాంపుల్ కూడా చెప్పింది కంగనా.. తాను ఓ సారి అనుకోకుండా షూట్‌ పర్పస్‌ ప్యారిస్‌కు వెళ్తే అక్కడికి కూడా వచ్చాడని, ఆ తర్వాత తన ఇంటికి కూడా రావడం మొదలు పెట్టాడని ఈ ఫైర్‌ బ్రాండ్‌ చెప్పుకొచ్చింది. ఆ హీరోకు తనంటే పిచ్చని, ఎప్పుడూ తన చుట్టే తిరిగేవాడని, డేటింగ్‌ చేద్దామని తన కాళ్ల వేళ్లా పడ్డాడని తెలిపింది. 

66
Image: Instagram

 కొన్నాళ్ల తర్వాత తనతో మాట్లాడటం మానేసిన ఆ హీరో ఈ మధ్య ఓ సినిమా ఆఫర్‌ చేయగా.. దానిని తిరస్కరించానని కంగనా తెలిపింది.ఇలా రణ్‌బీర్‌ పేరు ప్రస్తావించకుండా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు ఆ హీరో రణ్‌బీరే అని కామెంట్స్‌ చేస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories