టాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్పాశెట్టి. విక్టరీ వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. తెలుగులో శిల్పాశెట్టికి మంచి క్రే కూడా వచ్చింది.
ఆతరువాత మోహన్ బాబు జంటగా వీడెవడండీ బాబు సినిమాతో పాటు.. బాలకృష్ణ హీరోగా నటించిన భలే వాడివి బాసూ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది శిల్పా శెట్టి. కాని ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయియా. దాంతో ఆమె బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోయింది.
ప్రస్తుతం 50 ఏళ్ళ వయస్సులో కూడా శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే టైమ్ లో శిల్పా శెట్టికి అమెరికన్ షో బిగ్ బ్రదర్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక అందులో అమెరికన్ షో కావడంతో బోల్డ్ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది. బ్యూటీ.
ఈ కామెంట్స్ అప్పట్లో ఆమె చేయగా..ఇప్పుడు మరోసారి అవి వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు ఆ షోలో వెల్లడించిందట. అప్పట్లో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. కొత్తగా ఇండస్ట్రలోకి వచ్చిన శిల్పా శెట్టి..22 ఏళ్ల వరకు ముద్దులు కూడా పెట్టలేదట. కాని ఆతరువాత కాలంలో.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేస్తూ.. అంతా సమర్పించేసినట్టు టాక్.
ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని నటి ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది. న్యూస్ 18 కథనం ప్రకారం. .శిల్పాశెట్టి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అక్షయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేదట. అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో కథలు కథలుగా ప్రచరం అయ్యాయట. కాని వీరిద్దరు ఎప్పుడూ ఈ విషయాలను కన్ ఫార్మ్ చేయలేదు.
ప్రస్తుతం శిల్పాశెట్టి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకుని.. 100 కోట్లలో భారీ భవంతిని నిర్మించుకుని.. తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు వియాన్, సమీషా. ఈమధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడిపి వచ్చారు. ఈమధ్య వరకూ బయటకురాకుండా అజ్ఞాతంలో ఉన్నారు.