అంతే కాదు దావూద్ తో కలిసి మందానికి కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అని ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయ్యింది. క్రమంగా సినీ అవకాశాలు తగ్గడంతో మందాకిని కెరీర్ పాతాళానికి పడిపోయింది. దావూద్ సినిమా వాళ్లను హింసించడం.. అతనిపై ఉన్న నెగెటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో మందాకినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. ఫేమస్ డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు ఇనాయ, రబిల్.