కత్రీనా కైఫ్ పెళ్ళిలో అంత పెద్ద గొడవ జరిగిందా..? చెప్పులు విసురుకుంటూ... సంచలన విషయాలు వెల్లడించిన హీరోయిన్

Published : Nov 10, 2022, 07:15 PM IST

బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్  విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని ఏడాది కావొస్తుంది.  ఇక  తమ పెళ్లిలో జరిగిన ఓ వింత సంఘటన గురించి రీసెంట్ గా వెల్లడించింది కత్రీనా. పెళ్లిలో జరిగిన ఓ లొల్లి గురించి  సంచలన విషయాలు వెల్లడించింది బ్యూటీ. 

PREV
16
కత్రీనా కైఫ్ పెళ్ళిలో  అంత పెద్ద గొడవ జరిగిందా..? చెప్పులు విసురుకుంటూ... సంచలన విషయాలు వెల్లడించిన హీరోయిన్

మధ్య తరగతి పెళ్లి వేడుకలో చిన్నచిన్న గొడవలు కామన్ గా జరుగుతుంటాయి. స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం కామ్ గా ప్రస్టేజియస్ గా జరుగుతుంటాయి. అది ఎక్కడైనా సరే చాలా సర్వసాధారణం.  హీరో.. హీరోయిన్  పెళ్లిలో  గొడవలు జరుగుతాయి అని ఎవరైనా ఉహిస్తారా..? కాని కత్రీనా కైఫ్ పెళ్ళిలో పెద్ద గొడవ జరిగిందట. 

26

ఈ విషయాన్ని పెళ్ళి అయిన ఏడాదికి రీసెంట్ గా వెల్లడించింది కత్రీనా కైఫ్. బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకన్న కత్రీనా.. ఆతరువాత హీరో విక్కీ కౌశల్ తో కొన్నేళ్లపాటు డేటింగ్ చేసింది. గతేడాది డిసెంబరు 9 పెళ్లి బంధంతో  వీరిద్దరూ ఒక్కటయ్యారు. 

36

పెళ్లి తరువాత  షూటింగ్స్ లో ఎవరికివారు బిజీ అయిపోయారు కత్రినా, విక్కీ కౌశల్. ఇక అప్పుడు జరిగిన పెళ్లిలో జరిగిన పెద్ద గొడవ గురించి రీసెంట్ గా  బయటపెట్టింది కత్రీనా కైఫ్. పెళ్లి పీటలపై కూర్చుని గెస్టులవైపు చూస్తున్నాను. కానీ సడన్ గా నా వెనక నుంచి పెద్దగా సౌండ్స్ వినిపించాయి. దీంతో ఏం జరిగింది? అని వెనక్కి తిరిగి చూశాను అంటూ మొదలు పెట్టింది కత్రీనా. 

46

ఇక అక్కడ నా సిస్టర్స్, విక్కీ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. వారి గొడవ ఏ స్థాయికి చేరింది అంటే.. చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై ఒకరు విసురుకుని మరీ తిట్టుకున్నారు. నేను ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లలేకపోయాను. అలానే ఆ గొడవలో ఎవరు గెలిచారు అనేది కూడా అడగడం మర్చిపోయాను అని కత్రినా కైఫ్ అప్పటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ నవ్వేసింది కత్రీనా. 

56
Katrina Kaif

ఇక రీసెంట్ గా కత్రీనా నటించిన ఫోన్ భూత్ రిలీజైంది. ఇప్పుడు  క్రిస్ మస్, టైగర్ 3 సినిమాల్లో నటిస్తుంది కత్రీనా. అటు కత్రీనా భర్త.. బలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మాత్రం  సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

66

కత్రీనా కైఫ్ హీరోయిన్ గా తెలుగు తెరకే ముందు పరిచయం అయ్యింది. వెంకటేశ్ సరసన మల్లీశర్వి సినిమాలోనటించి మెప్పించింది. ఆతరువాత తెలుగు తెరకు హ్యాండిచ్చి.. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది కత్రీనా. తెలుగులో ఆతరువాత ఒక్కసినిమా కూడా చేయలేదు బ్యూటీ. 
 

Read more Photos on
click me!

Recommended Stories