బాలీవుడ్ బ్యూటీ, మోడల్, డ్యాన్సర్ నోరా ఫతేహి తన నెక్టస్ వేకేషన్ కు ప్లాన్ చేసుకుంటోంది. అయితే తన వేకేషన్ లో ఎవరూ భాగస్వామ్యులు కాబోతున్నారంటూ నెటిజన్లను ప్రశ్నిస్తోంది.
మోడల్, డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొంది కెనడియన్ యాక్ట్రేస్ ‘నోరా ఫతేహి’. అయితే తన గ్లామర్ తో, అవుట్ ఫిట్ తో ఎంతో మంది ప్రేక్షకులను తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.
26
‘దిల్బర్’ సాంగ్ తో అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి, ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బహుబలి’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను కూడా అరిచింది.
36
అప్పటికే, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషనల్ లో వచ్చిన ‘టెంపర్’ మూవీలోనూ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించి తెలుగు ఆడియెన్స్ తో స్టెప్పులేయించింది.
46
‘ఇట్టగానే రెచ్చిపోదామా’ ఐటెం సాంగ్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టున్న విషయం తెలిసిందే. దీంతో ఇటు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది నోరా ఫతేహికి. ఆ తర్వాత బహుబలిలో ఛాన్స్ కొట్టేసింది.
56
బహుబలి తర్వాత, నాగార్జున, కార్తీ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’ మూవీలోనూ స్పెషల్ సాంగ్ లో నటించిందీ ‘నెమలి’. ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేదు.
66
ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యిందీ బ్యూటీ. అయితే మొన్నటి వరకు షూటింగ్ బిజీలో ఉన్న హాట్ బ్యూటీ. ప్రస్తుతం వేకేషన్ కు వెళ్లే మూడ్ లో ఉంది. ఇందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిపింది. తనతో పాటు ‘ఇంకెవరైనా వస్తారా’ అంటూ ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ను ప్రశ్నించింది. ఇందుకు నెటిజన్లు మేమంటే.. మేము వస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు.