బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో సరదా గడుపుతోంది. మరోవైపు కేరీర్ పట్ల కూడా శ్రద్ద వహిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ 3’, అలాగే ‘మేరీ క్రిస్టమస్’ చిత్రాల్లో నటిస్తోంది.