గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందని ఒక వ్యక్తితో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రేమలో ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, అందుకు కలిసి తిరుగుతున్నారని న్యూస్ హైలెట్ అవుతూ వస్తోంది. ఇద్దరు అఫీషియల్ గా ఒప్పుకోకపోయినా... ఆ వార్తలు బలపరచడానికి కొన్ని సాక్ష్యలు కూడా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో ప్రేమలో ఉన్న జంటలు.. షికార్లు చేయడం కామన్. గోవాకో, మాల్దీవుల కోవెల్ళి ఎంజాయ్ చేస్తుంటారు. కాని వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు.