టాలీవుడ్ పై విషం కక్కిన రాధికా ఆప్టే.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ.

First Published | Feb 18, 2024, 8:54 AM IST

తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అనే సామెత హీరోయిన్ రాధికా ఆప్టేకు కరెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతం ఆమె ఆ పనే చేస్తోంది. సౌత్ సినిమాల ద్వారా బాగా ఫైమస్ అయిన ఆమె.. టాలీవుడ్ పై టైమ్ దొరికినప్పుడల్లా విషం కక్కుతోంది.  
 

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే ఒకరు. నార్త్ లోనే కాదు..  సౌత్ సినిమాల ద్వారా కూడా  పాపులారిటీని సంపాదించుకుంది రాధికా ఆప్టే. అయితే ఆమె  తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బోల్డ్ బ్యూటీ కావడంతో దేశ వ్యాప్తంగా రాధికా ఆప్టే కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. 
 

Image: Radhika Apte Instagram

తెలుగులో రెండు సినిమాలు చేసింది రాధిక.. నట సింహం బాలయ్య జోడీగా లెజెండ్, లయన్ సినిమాలలో మెరుపులు మెరిపించింది రాధికా ఆప్టే.అంతే కాదు బాలీవుడ్ సినిమాలుగా తెరకెక్కినా.. తెలుగు వాసనలున్న సినిమాలుగా  రక్తచరిత్ర1, రక్తచరిత్ర2 లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో  సైతం రాధికా ఆప్టేకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది.  


సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది రాధిక. పింక్ లిప్స్ తో రాధికా వయ్యారంగా ఇస్తున్న ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. రాధికా ఆప్టే మైమరపించే విధంగా మత్తుగా చూస్తూ ఊరిస్తోంది. సూపర్ స్టైలిష్ గా రాధికా ఇస్తున్న ఫోజులు యువతని ఆకట్టుకుంటున్నాయి. 

అయితే సౌత్ సినిమాలతో.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలతో ఇంత అనుబంధం ఉన్న రాధికా ఆప్టే.. సౌత్ సినిమాల గురించే వివాదాస్పద వ్యాక్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  గతంలో సౌత్ హీరోల గురించి నోటికివచ్చినట్టుగా మాట్లాడిన ఈబ్యూటీ.. తాజాగా మరోసారి తన మాటలకు పదును పెట్టింది. టాలీవుడ్ పై రకరకాల విమర్శలు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీపై విషం కక్కారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ.. ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు రాధిక. ఇక్కడ హీరోయిన్లను ధారుణంగా ట్రీట్ చేస్తారని.. అసలు మనిషిగా కూడా లెక్క చేయరని అన్నారు.  హీరోయిన్ అంటే ఈ ఇండస్ట్రీలో లెక్కలేదన్నారు.  సెట్ లో మూడో వ్యక్తిలా ఉండాల్సిందే తప్ప.. విలువ ఇవ్వరన్నట్టుగా మాట్లాడింది రాధిక.  
 

టాలీవుడ్ లో  హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందని.. షూటింగ్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వరని.. హీరోయిన్లకు అయితే అసలే ఇన్ఫర్మేషన్ ఇవ్వరన్నారు. ఇష్టవచ్చినట్టుగా షూటింగ్ లను రద్దు చేయడం..నచ్చినప్పుడు షూటింగ్స్ పెట్టుకోవడం ఇక్కడ కామన్ గా జరుగుతుందన్నారు రాధిక.  జరుగుతుందని ఆమె వెల్లడించారు.ఇతర యాక్టర్లకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా షూటింగ్ లను రద్దు చేయడం జరుగుతుందని రాధికా ఆప్టే అన్నారు. ఈ విధమైన ఇబ్బందులు నాకు చాలాసార్లు ఎదురయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఆ ఇండస్ట్రీలో నా అవసరం అంతేనని గ్రహించానని ఆమె తెలిపారు. రాధికా ఆప్టే చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా టాలీవుడ్ సినీ అభిమానులు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు.టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తుండటంతో రాధికా ఆప్టే ఈ విధంగా విషం కక్కుతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. రాధికా ఆప్టేకు తెలుగులో ఇకపై ఆఫర్లు వచ్చే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధికా ఆప్టే (Radhika Apte) సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
 

Latest Videos

click me!