హీరోయిన్ మౌనీ రాయ్ ‘నాగిని’ డైలీ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతమైన నటనతో టీవీ ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో ఆయా చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ క్రేజ్ పెరుగుతూ వస్తోంది.
రీసెంట్ గా రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన భారీ మైథలాజికల్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’లోనూ మౌనీ రాయ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు మౌనీకి కూడా మరింత పాపులారిటీని అందించింది.
ఇలా బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తోంది ఈ బ్యూటీ. వెండితెరపై అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుటోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.
మౌనీ రాయ్ నెట్టింట అడుగుపెట్టిందంటే అందాల ఆరబోతకు ఏమాత్రం హద్దులుండవు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ విందు చేస్తుంది. నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేలా పరువాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
బిగుతైన దుస్తుల్లో మౌనీ రాయ్ లేటెస్ట్ గా చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొడుతోంది. మినీ టైట్ ఫిట్ లో మౌనీ రాయ్ టెంప్టింగ్ పోజులకు కుర్రాళ్లు ఉలిక్కి పడుతున్నారు. అన్నీ యాంగిల్లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
అభిమానులతో పాటు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా మౌనీ లేటెస్ట్ ఫొటోషూట్ కు ఫిదా అవుతున్నారు. అమ్మడు పరువాల విందుకు ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 27న దుబాయ్‌కి చెందిన తన ప్రియుడు వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో గోవాలోని పనాజీలో బెంగాలీ, మలయాళీ సాంప్రదాయ పద్ధతుల్లో మౌనీ రాయ్ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విషయాలను కూడా పంచుకుంటోంది.
పెళ్లి తర్వాత గ్లామర్ షోలో మరింత డోస్ పెంచింది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో అసలైన అందాలతో దిమ్మతిరిగేలా ఫొటోషూట్లు చేస్తోంది. స్టార్ హీరోయిన్ స్థాయిలో ఇన్ స్టాలో 25 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించుకుంది. ఇలా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మౌనీ రాయ్ ప్రస్తుతం ‘మయా జాల’లో నటిస్తోంది.