ఇక చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్, మాస్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా కలిసి నటించిన ‘బాస్ పార్టీ’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఊర్వశీ స్పెషల్ అపియరెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.