బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నటించిన మ్యూజిక్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi) తెలుగు ప్రేక్షకులకు (Telugu) బానే పరిచయం అయింది. ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. పలు ప్రాజెక్టులకు ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారు.
26
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య, స్కంద, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఈ బ్యూటీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ కు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.
36
స్టార్ హీరోల సరసన గ్లామర్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తన అందం, ఫిట్నెస్ తోను ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. తన డాన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.
46
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే... మరోవైపు మ్యూజిక్ వీడియో (Music Video)లోనూ నటిస్తోంది. లేటెస్ట్ గా ప్రముఖ సింగర్ యోయో హనీసింగ్ (Yoyo Honey Singh)తో కలిసి విగ్దియన్ హీరన్ (Vigdiyan Heeran) అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.
56
యోయో హనీ సింగ్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వచ్చిన లేటెస్ట్ సాంగ్ కు సంగీత ప్రియులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఊర్వశీ రౌటేలా డాన్స్ కు మాత్రం అంతా ఆశ్చర్యపోతున్నారు.
66
ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. టాప్ వన్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటను సంగీత ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఊర్వశి నెక్స్ట్ తెలుగులో మరోసారి చిరంజీవి సరసన 'విశ్వంభర' (Vishwambhara) లో స్పెషల్ డాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.