బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్ని రీమేక్‌ చిత్రాల్లో నటించాడో తెలుసా?.. సీనియర్స్ లో ఆయన ప్లేస్‌ ఎక్కడంటే?

Published : Mar 15, 2024, 07:37 PM IST

బాలకృష్ణ ఇటీవల రీమేక్‌ సినిమాలు చేయడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం బాగానే చేశారు. అయితే హిట్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా చవిచూశారు. మరి ఆయన రీమేక్‌ చేసిన సినిమాలేంటో చూద్దాం.   

PREV
113
బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్ని రీమేక్‌ చిత్రాల్లో నటించాడో తెలుసా?.. సీనియర్స్ లో ఆయన ప్లేస్‌ ఎక్కడంటే?

ఏ చిత్ర పరిశ్రమలోనైనా సినిమాలు రీమేక్‌ కావడం సర్వసాధారణం. ఒకప్పుడు ఇది రెగ్యూలర్‌గా జరుగుతుంటాయి. తెలుగు సినిమాలు, తమిళంలో, కన్నడ, హిందీలో రీమేక్‌ అయ్యాయి. తమిళ సినిమాలు తెలుగు, కన్నడ, హిందీలోనూ రీమేక్‌ అయ్యాయి. మలయాళ చిత్రాలు దాదాపు అన్ని భాషల్లో రీమేక్‌ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ అడపాదడపా రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఓటీటీలు రావడంతో రీమేక్‌ల జోరు తగ్గింది. ఓటీటీలోనే ఇతర భాషల చిత్రాలను కూడా చూస్తున్నారు. దీంతో రీమేక్‌ చేసే సాహసం చేయడం లేదు, ఒకవేళ చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం లేదు. 

213

టాలీవుడ్‌లో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రాజశేఖర్‌ ఇలా చాలా మంది హీరోలు రీమేక్‌ సినిమాలు చేశారు. వీరిలో బాలయ్య ఎన్ని సినిమాలు రీమేక్‌ చేశాడనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆయన ఎన్ని సినిమాలు రీమేక్‌ చేశారు. వాటిలో హిట్లు ఎన్ని, ఫ్లాపులు ఎన్ని అనేది చూస్తే..

313

బాలకృష్ణ ఇప్పటి వరకు 108 సినిమాలు చేశారు. బాబీతో చేసే మూవీ 109వది. వీటిలో ఆయన ఇప్పటి వరకు 21 సినిమాలు రీమేక్‌ చేశారు. వాటిలో చివరగా `లయన్‌` మూవీ ఉంది. కొత్త దర్శకుడు సత్యదేవ్‌ రూపొందించారు. ఇది హాలీవుడ్‌లో వచ్చిన `అన్‌నోన్‌` అనే మూవీకి రీమేక్‌. ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌ అయ్యింది. 
 

413

బాలయ్య నటించిన `విజయేంద్రవర్మ` కూడా రీమేకే. ఇది హాలీవుడ్‌ మూవీ `ది బౌర్నే ఐడెంటిటీ` అనే చిత్రానికి రీమేక్‌. `ది లాంగ్‌ కిస్‌ గుడ్‌ నైట్‌` అనే మూవీ నుంచి కూడా ఇన్‌స్పైర్‌ అయ్యారట. తెలుగులో స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించారు. కానీ ఇక్కడి డిజాస్టర్‌ అయ్యింది. 

513

బాలయ్య నటించిన `లక్ష్మీ నరసింహా` కూడా రీమేక్‌. ఇది తమిళంలో విక్రమ్‌ హీరోగా వచ్చిన `సామి`కి రీమేక్‌. జయంత్‌ సి పరంజి దర్శకత్వం వహించారు. ఇందులో ఈ మూవీ తమిళంలో హిట్‌ అయ్యింది. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. 
 

613

బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్‌ సినిమాలను కూడా రీమేక్‌ చేశారు. వాటిలో `పాండురంగడు`, `నర్తనశాల` చిత్రాలున్నాయి. `పాండురంగ మహాత్య్మ` నుంచి `పాండురంగడు` మూవీని, `నర్తనశాల` సినిమాని తన స్వీయ దర్శకత్వంలో బాలయ్య రీమేక్‌ చేశారు. `పాండురంగడు` యావరేజ్‌గా ఆడింది. సౌందర్య చనిపోవడంతో `నర్తనశాల` మధ్యలోనే ఆగిపోయింది. 
 

713

బాలయ్య నటించిన `పలనాటి బ్రహ్మ నాయుడు` సినిమా కూడా రీమేక్‌. దీన్ని కన్నడ నుంచి రీమేక్‌ చేశారు. విష్ణువర్థన్‌ హీరోగా నటించిన `రాజ నరసింహ` అనే సినిమాకి రీమేక్‌. తెలుగులో బి గోపాల్‌ దర్శకత్వం వహించారు. ఇక్కడ ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ఇవివి సత్య నారాయణ దర్శకత్వంలో రూపొందిన `గొప్పంటి అల్లుడు` మూవీని హిందీలో గోవిందా హీరోగా వచ్చిన `హీరో నెంబర్‌ 1` చిత్రానికి రీమేక్‌. తెలుగులో ఇది జస్ట్ యావరేజ్‌. 
 

813

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో `శ్రీకృష్ణ పాండవీయం` ఒకటి. మంచి ఆదరణపొందింది. దీన్నిసింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో `శ్రీకృష్ణార్జున విజయం’గా రీమేక్ చేశారు. కానీ పెద్దగా ఆడలేదు. డిజప్పాయింట్‌ చేసింది. సింగీతం దర్శకత్వంలోనే బాలయ్య `భైరవ ద్వీపం` మూవీ చేశారు. ఇది ఎన్టీఆర్‌ నటించిన `పాతాల భైరవి`కి రీమేక్‌. ఇది మంచి విజయం సాధించింది. 
 

913

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `ముద్దుల మేనల్లుడు` సినిమాని తమిళంలో హిట్‌ అయిన `తంగమన రాసా` మూవీకి రీమేక్‌. ఇది ఇక్కడ హిట్‌ అయ్యింది. అలాగే ఆయన నటించిన `అశోక చక్రవర్తి` మూవీ మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన `ఆర్యన్‌` మూవీకి రీమేక్‌. శరత్‌ సక్సేనా దర్శకత్వం వహించగా, ఇక్కడ పెద్దగా ఆడలేదు. 
 

1013

ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన `రాముడు భీముడు` మూవీని అదే పేరుతో బాలయ్య రీమేక్‌ చేశాడు. ఇది జస్ట్ యావరేజ్‌గా ఆడింది. `మంగమ్మగారి మనవడు` మూవీ తమిళంలో హిట్‌ అయిన `మ్యాన్‌ వసనై` కి రీమేక్‌గా చేశాడు. బాలయ్య నటించిన తొలి సోలో హీరో మూవీ ఇది కావడం విశేషం. పెద్ద హిట్‌ అయ్యింది.  
 

1113

`మువ్వ గోపాలుడు` మూవీని `అరునదై నాల్‌` చిత్రానికి రీమేక్‌ గా చేశారు. బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. `రాము` మూవీని కమల్‌ హాసన్‌ నటించిన `పెర్‌ సొల్లుమ్‌ పిళ్లై`గా రీమేక్‌ చేశారు. ఇది కూడా పెద్ద హిట్‌ అయ్యింది. `నిప్పులాంటి మనిషి` సినిమాని హిందీలో ధర్మేంద్ర నటించిన `ఖయామత్‌`కి రీమేక్‌. ఇక్కడ యావరేజ్‌గా ఆడింది. 
 

1213

ఎన్టీఆర్‌ నటించిన `వద్దంటే డబ్బు` మూవీని జంధ్యాల దర్శకత్వంలో `బాబాయి అబ్బాయిగా` రీమేక్‌ చేశాడు, హిట్‌ అందుకున్నారు. `ఆత్మబలం` సినిమాని హిందీలో హిట్‌ అయిన `కర్ణ్‌` సినిమాకి రీమేక్‌గా చేశారు. ఫ్లాప్‌ ని చవిచూశారు. మిథున్‌ చక్రవర్తి నటించిన `డిస్కో డాన్సర్‌` మూవీకి రీమేక్‌ గా `డిస్కో కింగ్‌` మూవీని చేశాడు. ఇది ఫ్లాప్‌ అయ్యింది. ఇలా దాదాపు 20కిపైగా బాలయ్య రీమేక్‌లు చేశారు. 
 

1313

అయితే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి చేసిన సినిమాల కౌంట్‌ కూడా తీస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. అయితే `లయన్‌` మూవీ తర్వాత ఆయన రీమేక్‌లకు దూరంగా ఉంటున్నాడు. కాకపోతే బాలయ్య కెరీర్‌లో రీమేక్‌ మూవీస్‌ సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువ. ఒక నాలుగైదు సినిమాలు తప్పితే మిగిలిన డిజప్పాయింట్‌ చేశాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories