శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు కౌంటర్ ఇచ్చిన ఉర్ఫీ జావేద్, బట్టలు విప్పి సంపాదించేవాడు అంటూ..

First Published | Oct 7, 2023, 2:49 PM IST

తనను విమర్షించిన రాజ్ కుంద్రాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. ఇతరుల బట్టలు విప్పించి డబ్బలు సంపాదించిన వారు తమను విమర్షిస్తున్నారంటూ.. కౌంటర్ ఇచ్చారు 
 

బాలీవుడ్ లో డిఫరెంట్ గా డ్రస్సింగ్ అవ్వాలంటే.. అది ఒక్క ఉర్ఫీజావేద్ కు మాత్రమే సాధ్యం. ఆమె రెడీ అయినట్టుగా డిఫరెంట్ గా.. కొత్తగా.. ఒక రకంగా చెప్పాలంటే వింతగా రెడీ అవ్వడం ఎవరికి సాధ్యం కాదు. వినూత్న డ్రెస్ లు ధరించి నిత్యం మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.
 

Urfi Javed

అంతే కాదు జీన్స్ ఫ్యాన్ ట్ ను డ్రస్ గా మార్చి వసుకోవడం.. కూరగాయల డ్రెస్, ఆకు కూరల డ్రస్ తో పాటు.. తాను డిజైన్ చేసిన కొన్ని వింత విచిత్రపు బట్టలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే బాలీవుడ్ లో ఆమెకు డిఫరెంట్ ఇమేజ్ ఉంది. 


Raj Kundra broke his silence for the first time on pornography case

తాజాగా ప్రముఖ బిజినెస్ మ్యాన్, నిర్మాత, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై మండిపడింది ఉర్పీ. తన డ్రెస్ సెన్స్ పై రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతరుల దుస్తులు విప్పి డబ్బులు సంపాదించే వ్యక్తి కూడా తను వేసుకునే డ్రెస్ ల్ గురించి మాట్లాడుతున్నాడంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. 

ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ రాజ్ కుంద్రా ఉర్ఫీని ఏమని విమర్షించాడు.. అసలు ఈ ఇద్దరికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది.  పోర్న్ వీడియోలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హీరోయిన్ శిల్పా శెట్టి భర్త.. బాలీవుడ్ నిర్మాత రాజ్ కుంద్రా. కొన్నాల్లు జైల్లో ఉండి వచ్చిన ఆయన.. పెద్దగా బయటకు కూడా రావడంలేదు. వచ్చినా కూడా ఫేస్ మాస్క్ ను వేసుకుని కనిపిస్తున్నాడు. ఎవరు గుర్తు పట్టకుండా చూసుకుంటున్నాడు. 

ఇక రీసెంట్ గా  వినాయక చవితి సందర్భంగా, భార్య కొడుకుతో కలిసి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నపుడు కూడా రాజ్ కుంద్రా ముఖానికి మాస్క్ ఉంది. మీడియా ప్రతినిధులు ఈ మాస్క్ గురించి పదే పదే ప్రశ్నలు సంధించడంతో కుంద్రా అసహనంగా ఫీలయ్యారు కూడా. ఇక దీనిపై ఆయన సెటైరికల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ రోజుల్లో మీడియాకు కేవలం రెండే రెండు విషయాలపై ఆసక్తి ఉంది. ఒకటి నేను ఏం ధరిస్తున్నాను.. రెండు, ఉర్ఫీ ఏం ధరించడంలేదు.. అంటూ మీడియాను ఎగతాళి చేశారు. 
 

రాజ్ కుంద్రా పెట్టిన పోస్టుపై ఉర్ఫీ కిగట్టిగానే కోపం వచ్చినట్టుంది. వెంటనే ఆమె  తీవ్రంగా స్పందించింది. ఇతరుల బట్టలు విప్పడం ద్వారా డబ్బులు సంపాదించే వ్యక్తికి తన దుస్తులపై వ్యాఖ్యానించే అర్హత ఉందా.. అన్నట్టుగా అర్ధం  వచ్చే విధంగా ఓ పోస్ట్ పెట్టింది ఊర్ఫీ. దాంతో బాలీవుడ్ లో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. 

Latest Videos

click me!