గ్రాండ్ గా వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఒక్కచోట చేరి మెగా ఫ్యామిలీ సందడి..

First Published | Oct 7, 2023, 2:27 PM IST

మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి గడియలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీ వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేసింది. ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరద్దరూ ఒక్కటి కాబోతున్న తరుణంలో మెగా ఇంట పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. 
 

ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై విషెస్ తెలిపారు. కుటుంబ సభ్యులు, సినీ పెద్దల సమక్షంలో లావణ్య - వరుణ్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఇరుకుటుంబాలు బిజీగా ఉన్నాయి. రీసెంట్ గానే షాపింగ్ కూడా చేసిందీ జంట. 
 


ఇక వరుణ్ తేజ్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు వీడ్కోలు పలుకుతూ పార్టీలు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇటీవల తన స్నేహితులకు స్పెయిన్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. 40 మంది స్నేహితులు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంది.
 

ఫారేన్ లోనే ఓ హోటల్ లో ఈ సెలబ్రేషన్స్ జరిగినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలో పాల్గొంది. నాలుగు తరాలను ఓకే ఫ్రేమ్ లో చూసిన మెగా అభిమానులుఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మాత్రం సెలబ్రేషన్స్ కు హాజరు కాలేకపోయారు. మినహా మెగా కుటుంబీకులు అంతా సందడి చేశారు. 
 

ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నవంబర్ మొదటి వారంలోనే వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. దీంతో పెళ్లి ఏర్పాట్లను చకాచకా పూర్తి చేస్తున్నారు. ఇటలీవేదికగాపెళ్లి వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై అప్డేట్ రావాల్సి ఉంది. 

ఇక ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య  ఒక్కటవ్వబోతున్న విషయం తెలిసిందే. మెగా ఇంట పెళ్లి బజాలు మోగబోతుండటంతో అటు కుటుంబీకులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం తన చిత్రాలైనా ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘మట్కా’లపైనా ఫోకస్ పెట్టారు. పెళ్లి సందర్భంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది.
 

Latest Videos

click me!