పారిస్ లో మౌనీ రాయ్ మెరుపులు.. బ్లాక్ డ్రెస్ అదిరిపోయిందిగా.. నాగినీ బ్యూటీ ఖతర్నాక్ స్టిల్స్

First Published | Sep 30, 2023, 7:53 PM IST

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ లో ఆకట్టుకుంటోంది. అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేసింది.
 

‘నాగినీ’ సీరియల్ తో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన మౌనీ రాయ్ (Mouni Roy) ఇటు సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. నెట్టింట ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఆకట్టుకుంటున్న ఈ బాలీవుడ్ భామ తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. 
 

హిందీ సీరియల్స్ లో నటిస్తూనే వెండితెరపైనా ఆయా ఆయా పాత్రలు, స్పెషల్ అపియరెన్స్ తో అలరిస్తూ వచ్చింది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో నటించి మెప్పించింది. నెక్ట్స్ మరో హిందీ చిత్రంలో నటిస్తోంది. 


పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రస్తుతం వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. కిర్రాక్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. 
 

ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫొటోలను అభిమానుల కోసం పంచుకుంది. లాస్ట్ నైట్ పారిస్ లోని ఓ స్టార్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా స్టైలిష్ అండ్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది.

తను పంచుకున్న ఫొటోల్లో మౌనీరాయ్ డ్రెస్ చాలా స్టైలిష్ గానూ, అట్రాక్టివ్ గానూ ఉంది. అందరి చూపు తనపైనే పడేలా అవుట్ ధరించింది. ఈ సందర్భంగా ఖతర్నాక్ ఫోజులిస్తూ మతులు పోగొట్టింది. గుచ్చే చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. 

ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మౌనీ లుక్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ కామెంట్లతో ఆకాశానికి ఎత్తున్నారు. రీసెంట్ గా మౌనీ రాయ్ బుల్లితెరపై ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’లో మెరిసింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!