నడుమును నొక్కుతూ.. కత్తిలాంటి ఫోజులతో కవ్విస్తున్న నేహా శెట్టి.. ట్రెండీ వేర్ లో రాధిక మెరుపులు

First Published | Sep 30, 2023, 6:35 PM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) వరుసపెట్టి ఫొటోషూట్లు చేస్తోంది. నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. కిర్రాక్ ఫోజులతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

‘డీజే టిల్లు’తో దక్కించుకున్న క్రేజ్ ను నేహా శెట్టి ఇప్పుడు వినియోగించుకుంటోంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ సందడి చేస్తూ వస్తోంది. 
 

గ్లామర్ మెరుపులు మెరిపించడంతో నేహా శెట్టి నెట్టింట మరింత ఫాలోయింగ్ దక్కించుకుంటోంది. తీరొక్క డ్రెస్ లో దర్శనమిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫొటోషూట్లతో మైమరిపిస్తోంది. మత్తు ఫోజులతో మతులు పోగొడుతోంది. 
 


తాజాగా ఈ బ్యూటీ రెడ్ గౌన్ లో మెరిసింది. అదిరిపోయే లుక్ లో తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. మరోవైపు నడుముపై చేతులేసి మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. కవ్వించే చేష్టలతో, చురకత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

రీసెంట్ గా నేహా శెట్టి ‘బెదురులంక2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనతో మెప్పించింది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఇలా మరో మంచి సినిమాను తన ఖాతాలో వేసుకుంది నేహాశెట్టి. నెక్ట్స్ మరో రెండు చిత్రాలతో రానుంది. 
 

తదుపరి యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో నటించిన ‘రూల్స్ రంజన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘ట్రైలర్’, ‘సమ్మోహనుడా’ సాంగ్ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం నుంచి వచ్చిన ‘సుట్టంలా సూసిపోకలా’ సాంగ్ వైరల్ గా మారింది. విశ్వక్, నేహా డాన్స్ కూడా అదిరిపోయింది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. 
 

Latest Videos

click me!