బికినీలో మౌనీరాయ్ పాలరాతి బొమ్మే.. బీచ్ లో ఫ్రెండ్ తో ‘నాగినీ’ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!

First Published | Dec 31, 2023, 4:56 PM IST

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ Mouni Roy సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె బికినీలో ఫొటోలకు ఇచ్చిన ఫోజులు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

‘నాగినీ’ డైలీ సీరియల్ తో మౌనీరాయ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో చాలానే సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. హీరోయిన్ గా, కీ రోల్స్ లో నటిస్తూ అలరిస్తోంది. 

చివరిగా ఈ బ్యూటీ  రన్బీర్ కపూర్ - అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మస్త్రం’ మూవీలో నటించింది. నెగెటివ్ షేడ్స్ లో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం తదితర చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. 
 


అటు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ ఫొటోలను అభిమానులతోనూన పంచుకుంటుంది. 

ప్రస్తుతం సెలబ్రెటీలంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మౌనీరాయ్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్స్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా తాజాగా నెట్టింట షేర్ చేసింది. 

సెలబ్రేషన్స్ లో భాగంగా మౌనీరాయ్ బికినీలో దర్శనమిచ్చింది. తన స్నేహితురాలితో కలిసి ఫొటోలకూ ఫోజులిచ్చింది. పొట్టి దుస్తుల్లో మౌనీరాయ్ చర్మ సౌందర్యంతో మంత్రముగ్ధులను చేసింది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో పాలరాతి బొమ్మవలే కనిపించింది. 

న్యూ ఇయర్ కు తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులూ ఆమెకు అడ్వాన్డ్స్ గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!