‘బ్రహ్మస్త్రం’ బ్యూటీ తెగింపు.. టూపీస్ బికినీలో మైండ్ బ్లాక్ చేస్తున్న మౌనీ రాయ్.. న్యూ ఇయర్ ట్రీట్!

First Published | Dec 30, 2022, 3:27 PM IST

‘బ్రహ్మాస్త్రం’తో అలరించిన మౌనీ రాయ్ (Mouni Roy) ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా టూపీస్ బికినీలో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
 

బాలీవుడ్ నటి మౌనీరాయ్ ‘నాగిని’ డైలీ సీరియల్ లో అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే వెండితెరపై ఆయా చిత్రాల్లో మెరిసి ప్రేక్షకులను కట్టిపడేసింది. అదే విధంగా ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తూనే ఉంది. 
 

ఈ ఏడాది జనవరి 27న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సూరజ్ నంబియార్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ గోవాలోని పనాజీలో బెంగాలీ, మలయాళీ సాంప్రదాయ పద్ధతుల్లో కుటుంబీకులు, పలువురు ప్రముఖుల సమక్షంలో మూడు మూళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. 
 


అప్పటి నుంచి భర్తతో కలిసి బ్యాక్ టు బ్యాక్ టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తూనే ఉంది. అభిమానులకు ఊహించని విధంగా  గ్లామర్ ఫీస్ట్ కలిగిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భర్త సూరజ్ మరియు సన్నిహిత మిత్రులతో అబుదాబికి బయల్దేరింది. బీచ్ లు, రిసార్టులో తెగ ఎంజాయ్ చేస్తోంది.
 

 ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్న ఓ ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. టూపీ బికినీలో బీచ్ లో దర్శనమిచ్చిన మౌనీ రాయ్ సెగలు పుట్టిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మైండ్ బ్లోయింగ్ అందాలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.

టూ పీస్ బ్లాక్ బికినీలో విలాసవంతమైన బీచ్ లో తడి అందాలతో మతులు పోగొట్టింది. నల్లటి సన్ గ్లాసెస్ ధరించి.. చేతిలో సాఫ్ట్ డ్రింక్ తో రచ్చరచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  ఈ సందర్భంగా నెటిజన్లూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. న్యూ ఇయర్ ట్రీట్ వచ్చిందంటూ.. స్టన్నింగ్ అనే కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

రీసెంట్ గా రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన భారీ మైథలాజికల్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్ కీలక పాత్రలో అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.  ప్రస్తుతం ‘ద వర్జిన్ ట్రీ’లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!