మౌనీరాయ్ కి ఏమైంది.. తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే.. బాలీవుడ్ నటి ఎమోషనల్ నోట్

First Published | Jul 23, 2023, 2:03 PM IST

ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎనర్జిటిక్ గా కనిపించే మౌనీ రాయ్ (Mouni Roy).. తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. తొమ్మిది రోజులుగా ఆస్ప్రతిలోనే ఉన్నానంటూ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. 
 

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ‘నాగిని’ సిరీయల్ తో మంచి ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అటు సీరియల్స్, టీవీ షోలో, సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా ‘బ్రహ్మస్త్ర’ మొదటి భాగంలో నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించింది. 
 

ప్రస్తుతం ‘వర్జిన్ ట్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే... మౌనీ రాయ్ ఎప్పటికప్పుడు తన గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ తన అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. 
 


అయితే ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆస్ప్రతిలో చేరానంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండే బాలీవుడ్ నటి తొమ్మిదిరోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నానని చెప్పింది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలు, చేతికి నిడిల్ ఉన్న పిక్స్, మరికొన్ని చిత్రాలను షేర్ చేసింది. 
 

అలాగే ఎమోషనల్ గా నోట్ రాసుకొచ్చింది. నోట్ ప్రకారం.. ’తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. లోతైన ఆలోచనలతో మునిగిపోయాను. ప్రస్తుతం తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆరోగ్యం బాగానే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నాకోసం సమయం వెచ్చించి బాగా చూసుకున్న ఫ్రెండ్స్, డాక్టర్స్, నర్సులకు చాలా కృతజ్క్షతలు. 
 

ఇక భర్త గురించి రాస్తూ.. మీలా నన్నేవరూ చూసుకోలేరు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.’ అంటూ భర్త నంబియార్ గురించి చెప్పుకొచ్చింది. అయితే వారానికిపైగా ఆస్ప్రతిలో ఉండాల్సినంతగా మౌనీరాయ్ కి ఏమైందని అభిమానులు ఆందోళన పడుతున్నారు. 
 

కేవలం తను ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్టు మాత్రమే మౌనీ రాయ్ పోస్టు పెట్టారు. తన అనారోగ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏదేమైనా మౌనీరాయ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘స్పీడీ రికవరీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మౌనీ పోస్టు వైరల్ గా మారింది.

Latest Videos

click me!