ఒకే బీచ్ లో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల సందడి... వాళ్ల అల్లరికి సూర్యుడే చిన్నబోయాడుగా!

First Published | Dec 21, 2023, 6:19 PM IST

బాలీవుడ్ హీరోయిన్లు ఇద్దరూ ఒకే బీచ్ లో సందడి చేశారు. పొట్టి దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా మౌనీరాయ్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ నటి మౌనీరాయ్ (Mouni Roy)  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. మరోవైపు గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ నెట్టింటిని హీటికెక్కిస్తుంటారు. 
 

తాజాగా మౌనీరాయ్ స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. రీసెంట్ గా బాలీవుడ్  యంగ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani)తో ఓ బీచ్ లో సందడి చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. వారి అల్లరి అంతాఇంతా కాదనిపించింది.  
 


ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓకే బీచ్ లో, ఓకే రంగు దుస్తుల్లో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు చేసిన సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాళ్లిచ్చిన స్టిల్స్ కు ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యేలా చేశారు. 

బీచ్ లో పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేశారు. కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఓకే ఫ్రేమ్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు మెరియడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. 
 

అయితే, దిశా పటానీ, మౌనీరాయ్ ఒకే దగ్గర కనిపించడం అది కూడా బీచ్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఆకర్షితులవుతున్నారు. ఇద్దురు బ్యూటీల అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. అందాన్ని వర్ణిస్తూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
 

ఇక మౌనీ రాయ్ చివరిగా ‘బ్రహ్మస్త్రం’ చిత్రంలో అలరించింది. దిశా పటానీ గతేడాది ‘ఏక్ విలన్ రిటన్స్’తో ఆకట్టుకుంది. అలాగే ‘కల్కి 2898 ఏడీ’, ‘యోదా’, ‘కంగువా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సమయం ఉన్నప్పుడు ఇలా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది.
 

Latest Videos

click me!