30 లక్షల టికెట్లు సోల్డ్ అవుట్, సలార్ సునామీ మొదలైంది.. ప్రభాస్ మూవీపై అదొక్కటే డౌట్

Published : Dec 21, 2023, 05:01 PM IST

డిసెంబర్ 22 అంటే రేపటి నుంచి సలార్ సునామి మొదలు కాబోతోంది. ఏరియాల వారీగా నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్, అమ్ముడవుతున్న టికెట్స్ షాకింగ్ గా మారాయి.

PREV
16
30 లక్షల టికెట్లు సోల్డ్ అవుట్, సలార్ సునామీ మొదలైంది.. ప్రభాస్ మూవీపై అదొక్కటే డౌట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ చిత్రం మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇండియా వ్యాప్తంగా సలార్ మ్యానియా మామూలుగా లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సలార్ పై అంచనాలు వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బాక్సాఫీస్ జాతర మొదలైంది. కనీవినీ ఎరుగని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. 

26

డిసెంబర్ 22 అంటే రేపటి నుంచి సలార్ సునామి మొదలు కాబోతోంది. ఏరియాల వారీగా నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్, అమ్ముడవుతున్న టికెట్స్ షాకింగ్ గా మారాయి. ఈ చిత్రంలో ప్రభాస్ స్నేహితుడిగా అత్యంత కీలక పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. జగపతి బాబు, శృతి హాసన్,ఈశ్వరి రావు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

36

ఇండియా వ్యాప్తంగా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ 30.25 లక్షలు దాటేశాయి. ఇది నిన్నటి వరకు నమోదైన వివరాలు. ఏరియాల వారీగా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూద్దాం 

ఆంధ్ర ప్రదేశ్ : 13.25 లక్షలు 

నైజాం  : 6 లక్షలు 

నార్త్ ఇండియా : 5.25 లక్షలు 

కర్ణాటక : 3.25 లక్షలు 

కేరళ : 1.5 లక్షలు 

తమిళనాడు : 1 లక్ష 

46

ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 30.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అది కూడా ప్రధాన మల్టిఫ్లెక్స్ సంస్థల అయిన సినిపోల్స్, పీవీఆర్, ఐనాక్స్ కాకుండా ఈ రేంజ్ విధ్వంసం జరిగింది. పీవీఆర్, ఐనాక్స్ విషయంలో కాస్త వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నార్త్ లో పీవీఆర్, ఐనాక్స్ నుంచి సలార్ చిత్రానికి థియేటర్లు లభించలేదు. వాళ్ళు ఎక్కువగా షారుఖ్ డంకి చిత్రానికే థియేటర్లు కేటాయించారు. 

56

అయితే ఆ వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలకు వాళ్ళు కూడా షాకైనట్లు తెలుస్తోంది. సలార్ మ్యానియాని క్యాష్ చేసుకునేందుకు పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు త్వరలోనే సలార్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నాయట. ఈ స్థాయిలో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సలార్ చిత్రంపై ఉన్న డౌట్ ఒక్కటే. 

66

ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో డ్రామాకి పెద్ద పీటవేసినట్లు రాజమౌళి ఇంటర్వ్యూలో తెలిపారు. డ్రామా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంచెం తేడా జరిగినా సాగదీసినట్లు అనిపిస్తుంది. చిత్రంలో 5 యాక్షన్స్ బ్లాక్స్ ఉన్నాయట. ప్రభాస్ ఎలివేషన్స్ తో యాక్షన్ సన్నివేశాలు ఒకదానిని మించినట్లు మరొకటి ఉంటుందట. అందులో సందేహం లేదు. మిగిలిన చిత్రం డ్రామా ప్రధానం ఉండేట్లు తెరకెక్కించానని ప్రశాంత్ నీల్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories