వైట్ సూట్ లో మలైకా అరోరా స్టైలిష్ లుక్.. బెడ్ పై ‘గబ్బర్ సింగ్’ బ్యూటీ మైండ్ బ్లాక్ పోజులు!

First Published | Jan 24, 2023, 4:49 PM IST

బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తున్న ఈ భామ కిల్లింగ్స్ లుక్స్ తో కుర్రాళ్ల చూపులను కట్టిపడేస్తోంది. 
 

మోడల్, నటిగా,  డాన్సర్ గా మలైకా అరోరా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు ఆడియెన్స్ ను కూడా ‘గబ్బర్ సింగ్’లో  స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. ‘కెవ్వు కేక’ సాంగ్ తో యువతను ఉర్రూతలూగించింది.

అంతకు ముందే సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘అతిథి’చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది. ‘గబ్బర్ సింగ్’తో మాత్రం సౌత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ మళ్లీ బ్యాక్ టు బాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధం అయ్యింది.
 


ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ విందు చేస్తోంది.  తాజాగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిందీ బ్యూటీ. తెల్లటి సూట్ ధరించి బెడ్ పై టెంప్టింగ్ పోజులతో ఫొటోషూట్ చేసింది. 

మత్తు చూపులు, మైమరిపించే పోజులతో కుర్రకారను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టైలిష్ సూట్ లో మలైకా ఐదుపదుల వయస్సులోనూ యంగ్ గానే కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

మూడేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మలైకా గతేడాది ‘యాన్ యాక్షన్ హీరో’లో స్పెషల్ డాన్స్ తో మెప్పించింది. 2020లో అరోరా కార్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే దాని నుంచి కోలుకునేందుకు కాస్తా సమయం పట్టింది. అందుకే అప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
 

మరోవైపు టీవీ షోల్లోనూ సందడి చేసింది. లాక్ డౌన్ లో ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’ షోకు జడ్జీగా వ్యవహరించింది. గతేడాది వచ్చిన ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ షోలోనూ మెరిసింది. ఇక ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. 
 

Latest Videos

click me!