9వ వారం అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ వీడనంటూ గీతూ మారాం చేసింది. భయంకరంగా ఏడ్చింది. ఫస్ట్ టైం ఓ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఆడియన్స్ తో కూడా కన్నీరు పెట్టించింది. రెండు రోజులు క్వారంటైన్ చేసిన రూమ్ కి వెళ్లి అన్నం, నీళ్లు లేకుండా గీతూ ఏడ్చారట. పేరెంట్స్ వచ్చి నచ్చజెప్పడంతో అక్కడ నుండి ఇంటికి వెళ్లారట.