ముక్కుపుడక ధరించి.. చీరకట్టులో జాన్వీకపూర్ అందాల విందు.. నెవర్ బిఫోర్ లుక్ లో స్టన్నింగ్ పోజులు!

First Published | Jan 27, 2023, 11:23 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా గిరిజన మహిళలా  దర్శనమిచ్చింది. 
 

స్టార్ కిడ్, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా నెవర్ బిఫోర్ లుక్ లో దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. 
 

ముఖ్యంగా జాన్వీ కపూర్ ఇంటర్నెట్ లో అడుగుపెడితే ఆ రోజంతా నెటిజన్లకు పండగే. ఆ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ తన ఫ్యాన్స్ తో పాటు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నూ ఆకట్టుకుంది. 


తాజాగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ఇంతకుముందెన్నడూ చూడని అవతార్ లో ఆకట్టుకుంటోంది. గిరిజన మహిళగా చీరకట్టి, ముక్కుపుడక పెట్టుకొని ఆకట్టుకుంటోంది. టాప్ గ్లామర్, నడుము అందాలతో మతులు పోగొడుతోంది.  

ఇక బ్లౌజ్ లేకుండా చీరకట్టులో టాప్ గ్లామర్ ను విందు చేసింది. బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ముఖ్యంగా ముక్కుపుడక ధరించడంతో జాన్వీ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఇక మత్తు చూపులతో మయా జేస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 

అయితే, జాన్వీ ఫస్ట్ టైమ్ ఇలాంటి దుస్తుల్లో ఫొటోషూట్లు చేయడంతో నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయిన ఫొటోలు రెండు గంటల్లో 5 లక్షలకు పైగా లైక్స్ ను దక్కించుకున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్వీకి సినిమా ఆఫర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక త్వరలో జాన్వీ టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా సౌత్ ఆడియెన్స్ ను పలకరించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజులు ఆగితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

click me!