చిట్టి నడుముతో మెస్మరైజ్ చేస్తున్న రష్మీ గౌతమ్.. కిల్లింగ్ పోజులతో హార్ట్ బీట్ పెంచేసిన స్టార్ యాంకర్!

First Published | Jan 27, 2023, 10:24 PM IST

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

స్టార్ యాంకర్ గా రష్మీ గౌతమ్ బుల్లితెరపై ప్రస్తుతం సందడి చేస్తోంది. మరోవైపు నటిగానూ ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్ గానూ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. మున్ముందు మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
 

ప్రస్తుతం బుల్లితెరపైనే యాంకర్ గా అలరిస్తోంది. జబర్దస్త్ కామెడీ షోలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ అప్పట్లో కొద్దిరోజులు షోకు దూరంగా ఉండి మళ్లీ కొనసాగుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 


రష్మీ గౌతమ్ తన అభిమానులకు ఈషోలతో ఎంటర్ టైన్ మెంట్ అందించడంతో పాటు సోషల్ మీడియాలోనూ టచ్ లోనే ఉంటోంది. తన వ్యక్తిగత  విషయాలనూ ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తోంది. 

మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా చాటుకుంటుంది. కరోనా సమయంలో పేదలకు, సాయం అవసరం ఉన్న వారికి తనవంతుగా సేవ చేసింది. అలాగే మూగజీవాలకూ ఫుడ్ అందించి గొప్ప మనస్సును చాటుకుంది.
 

ఇలాంటి కార్యక్రమాలతో రష్మీకి ఇంటర్నెట్ లో మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. దీంతో ఫ్యాన్స్ ను అప్పుడప్పుడు పలకరిస్తూ లైవ్  సెషన్స్ నిర్వహిస్తుంటుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు బదులిస్తూ వస్తోంది.

మరోవైపు గ్లామర్ విందులోనూ రెచ్చిపోతుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్రాళ్ల చూపులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
 

కొన్ని ఫొటోల్లో రష్మీ సిట్టింగ్ పోజిషన్ లో ఇచ్చి స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు చిట్టి నడుమును చూపిస్తూ ఇచ్చిన పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టార్ యాంకర్ మత్తు చూపులు, మతిపోయే స్టిల్స్ పై కామెంట్లు పెడుతున్నారు. 

యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గానూ వెండితెరపై అలరిస్తోంది.  ‘గుంటూరు టాకీస్’,‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’,‘అంతకు మించి’ చిత్రాలతో నటిగా గుర్తింపు దక్కించుకుంది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!