స్లీవ్ లెస్ డ్రెస్ లో ఇషా గుప్తా కిల్లింగ్ లుక్స్.. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం స్టన్నింగ్ స్టిల్స్

First Published | Jun 27, 2023, 4:03 PM IST

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta)  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

గ్లామర్ విందులో బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఎప్పుడో హద్దుల్ని దాటేసిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుస పెట్టి జోరుగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

వెండితెరపై అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ అందాల రచ్చ చేస్తోంది. నెట్టింట నిర్మోహమాటంగా, నిర్భయంగా తన చెప్పాలనకుంది చెప్పేస్తుంటుంది. మరోవైపు గ్లామర్ షోలోనూ ఏమాత్రం తగ్గేదే లేదంటుంది. 


ఇప్పటికే ఇషా గుప్తా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫొటోషూట్లకు ఇంటర్నెట్ షేక్ అయ్యేవి. ప్రస్తుతమూ అదే పంథాలో నడుస్తోంది. అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.

తాజాగా ఇషా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఓ ప్రముఖ వాచ్ కంపెనీ హబ్ లాట్ కు సంబంధించిన ప్రమోషన్ కోసం ఫొటోషూట్ చేసింది. స్లీవ్ లెస్ బిగుతైన డ్రెస్ లో అందాలను ఆరబోసింది. అలాతే తన చేతికి వాచ్  ను ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

హబ్ లాట్ వాచ్ లాంఛ్ చేసిన సందర్భంగా మొదటి వాచ్ ను తనే ధరించడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇషా అటు సినిమాలతో పాటు ఇటు పలు బ్రాండ్లనూ ప్రమోట్ చేయడంలో బిజీ అయ్యారు. 
 

బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ఇషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం  సినిమాల పరంగా ఎలాంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి. గతేడాది ‘ఆశ్రమం’ (Aashram) వెబ్ సిరీస్ తో అలరించింది. ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది.
 

Latest Videos

click me!