ఇంటర్నెట్ ను షేక్ చేసిన ‘లైగర్’ బ్యూటీ స్టన్నింగ్ ఫొటోస్.. అనన్యపాండే మైండ్ బ్లోయింగ్ స్టిల్స్!

First Published | Feb 10, 2023, 3:56 PM IST

‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) త్రో బ్యాక్ పిక్స్ తో మతులు పోగొడుతోంది. తాజాగా యంగ్ బ్యూటీ పంచుకున్న త్రో బ్యాక్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం హిందీ చిత్రాల్లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా.. తనదైన శైలితో యూత్ లో యమా క్రేజ్ దక్కించుకుంది.  గ్లామర్ పరంగా,  నటన పరంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
 

ఇటు టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైనా.. ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది.
 


ఇదిలా ఉంటే.. యంగ్ హీరోయిన్ అనన్య పాండే  కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లనూ అందుకుంటోంది. అతితక్కువ సమయంలోనే బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చరంభోలా చేస్తున్నది. 

ముఖ్యంగా అనన్య బోల్డ్ ఫొటోషూట్లతో గతేడాది ఇంటర్నెట్ ను షేక్ చేసేసింది. ఏకంగా బికీనీలో దర్శనమిచ్చి మంటలు రేపిందీ బ్యూటీ. మరిన్నిసెల్ఫీ ఫొటోలతోనూ నెటిజన్లను పిచ్చెక్కించింది. తాజాగా తనకు నచ్చిన, గుర్తుండిపోయే కొన్ని త్రో బ్యాక్ ర్యాండప్ సెల్ఫీలను అభిమానులతో పంచుకుంది.
 

ఈ పిక్స్ లో అనన్యపాండే బికీనీలో ఘాటు అందాలను ప్రదర్శించింది. అద్దం ముందు సెల్ఫీలకు ఘాటు గా పోజులిచ్చింది. స్టన్నింగ్ సెల్ఫీ పిక్స్ తో కుర్రగుండెల్లో గంటలు మోగించింది. ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను పంచుకుంటూ ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘మిర్రర్ సెల్ఫీలు.. ఫొటోలు తీసినప్పుడు, విచిత్రమైన సెల్ఫీలు తీసినప్పుడు యాదృచ్ఛిక అనుభూతిని కలిగించింది’ అని పేర్కొంది.
 

అనన్య పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బోల్డ్ బ్యూటీ అందాల ప్రదర్శనకు ఫిదా అవుతూ నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. ఇక అనన్య ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఖో గయే హమ్ కహాన్’ విడుదలకు సిద్ధం ఉండగా.. ‘డీమ్ గర్ల్ 2’ షూటింగ్ దశలో ఉంది.
 

Latest Videos

click me!