‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ చీర అదిరిపోయింది.. చీరకట్టు ఇంకా అదిరింది.. అలియా భట్ బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 25, 2023, 5:05 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)  ప్రస్తుతం తను లేటెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా చీరకట్టులోనే మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా శారీలో లుక్ లో మెరిసిపోయింది. 
 

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలిసినిమాతోనే భారీ హిట్ ను సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘సీత’ పాత్రలో నటించి మెప్పించింది. తన నటనకు మంచి రెస్పాన్స్ కూడా దక్కింది.
 

ఆ తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా అలియా ఒప్పుకోలేదు. తన పెళ్లి, ప్రెగ్నెన్సీ  కారణంగా సినిమాలకు కొంతం గ్యాప్ కూడా ఇచ్చింది. గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో అలియా భట్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గ్రాండ్ ఏర్పాట్లతో పాటు హిందూ సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం జరిగింది.
 


ఇక గతేడాది ఈ ముద్దుగుమ్మ పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమెకు రాహు అని పేరుకూడా పెట్టారు. మొన్నటి వరకు ఫ్యామిలీతోనే సమయం గడిపిన అలియా ప్రస్తుతం మళ్లీ తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి దుమ్ములేపేందుకు సిద్ధంగా ఉంది. 
 

ప్రస్తుతం రన్వీర్ సింగ్ - అలియా భట్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా Rocky aur Rani kii prem kahaani  చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జూలై 28న విడుదల కానుండటంతో ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా కోల్ కత్తాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. 
 

ఈ సందర్భంగా అలియా భట్ చీరకట్టులో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. వరుసగా శారీలోనే ప్రమోషన్స్ లో కనిపిస్తోంది. ఇక తాజాగా రెడ్ అండ్ పింక్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో, అదిరిపోయే శారీలో అలియా భట్ మంత్రముగ్ధులను చేసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

చీరకట్టులో వరుసగా ఫొటోషూట్లు చేస్తుండటంతో ఫ్యాన్స్  ఫుల్ ఫిదా అవుతున్నారు. పెళ్లై, కూతురు పుట్టిన అలియా చెక్కుచెదరని అందంతో మెరిసిపోతుండటంతో నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫొటోలను పంచుకుంటూ మూడురోజుల్లో సినిమా థియేటర్లలోకి వస్తుందని, అందరూ చూసి ఆనందించాలని పేర్కొంది. 
 

Latest Videos

click me!