Published : Mar 23, 2022, 06:11 PM ISTUpdated : Mar 23, 2022, 06:18 PM IST
భారతీయ విప్లవ కారుడు భగత్ సింగ్ (Bhagat Singh) వర్థంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తను నటించిన చిత్రంలోని భగత్ సింగ్ వేషధారణ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
బాలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు సోను సూద్ (Sonu Sood). సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ సమాజంలోని విపత్తుల నుంచి బాధితులకు ఆదుకుంటూ రియల్ లైఫ్ హీరోగా పేరు సాధించుకున్నాడు.
27
Sonu Sood Post
కోవిడ్ 19 మొదటి దశ ప్యాండమిక్ సిచ్యూయేషన్ లో ఎంతమంది పేదలకు అండగా నిలిచారు. ట్రాన్స్ పోర్ట్, సరుకుల పంపిణీ, ఉపాధి, ఇతర సహాయ సహకారాలు అందించి దేశమంతటా మనస్సున్న మారాజు అనిపించుకున్నాడు.
37
Sonu Sood Post
ఇటీవల రష్యా దాడులతో ఉక్రేయిన్ లో చిక్కుపోయిన భారతదేశ పౌరులను కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు సోనుసూద్. ఇటా అటు చిత్రాలతో పాటు, ఇటు సామాజిక పరిస్థితులకు కూడా ఎప్పటికప్పడు స్పందిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు.
47
Sonu Sood Post
ప్రజాసేవ చేసి ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్న సోనుసూద్ తాజాగా దేశం కోసం పోరాడిన భగత్ సింగ్ ను గుర్తు చేసుకున్నాడు. మార్చి 23న భారతీయ విప్లవ కారుడు షహీద్ భగత్ సింగ్ వర్థంతి కావడంతో ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయన గొప్ప తనాన్ని వివరిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
57
Sonu Sood Post
2020లో రిలీజ్ అయిన ‘షహీద్-ఇ-ఆజం’(Shaheed-E-Azam) చిత్రంలో సోను సూద్ భగత్ సింగ్ పాత్రలో నటించారు. అయితే ఆయన వర్థంతి సందర్భంగా ఈ చిత్రంలోని భగత్ సింగ్ వేషధారణలో ఉన్న పలు సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
67
Sonu Sood Post
ఈ ఫొటోలు భగత్ సింగ్ జీవితంలోని కొన్ని ఘటనలు తెలిపేవిగా ఉన్నాయి. భగత్ సింగ్ వీరత్వాన్ని చూపించేలా, జైల్లో ఆయన ఖైదీగా ఉన్నప్పడి సన్నివేశం, పోలీసులు ఆయనపై చేసిన దాడి, ఉరికంభం ఎక్కేముందు దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
77
Sonu Sood Post
అయితే, సోనుసూద్ ఈ ఫొటోలు షేర్ చేస్తూ ఇలా నోట్ రాశారు. ‘లెజెండ్ షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనను స్మరించుకుంటున్నాను. షాహీద్-ఈ-ఆజామ్‌తో సినిమాలో భగత్ సింగ్ పాత్రలో నటించడం నాకు దక్కిన గౌరవం. ఆయన ఎప్పుడూ చెప్పినట్లుగా మొదటివి ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనవి, అవే మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.