Suhana Khan:కారులో అజ్ఞాతవ్యక్తితో స్టార్ హీరో కూతురు... మీడియా కంటపడడంతో ముఖాలు దాచుకున్న జంట

Published : Mar 23, 2022, 04:59 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అజ్ఞాతవ్యక్తితో కారులో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఓ యుంగ్ ఫెలోతో సుహానాను కారులో ఉండడాన్ని గమనించిన మీడియా... వారిద్దరి ఫోటోలు కెమెరాలో బంధించారు.

PREV
17
Suhana Khan:కారులో అజ్ఞాతవ్యక్తితో స్టార్ హీరో కూతురు... మీడియా కంటపడడంతో ముఖాలు దాచుకున్న జంట
Suhana khan


షారుఖ్ కూతురిగా సుహానా ఖాన్(Suhana Khan) పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహానా ఖాన్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచుగా తన పర్సనల్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే సుహానా ఖాన్ నటిగా ఎంట్రీ ఇచ్చారు. 
 

27
Suhana khan

ఆమె 'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. బాలీవుడ్ లో మాత్రం ఆమె అడుగు ఇంకా పడలేదు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు జోయా అక్తర్ ఆఫీస్ కి వెళ్లిన సుహానా ఖాన్ వార్తలకెక్కారు. ఆమె డెబ్యూ మూవీ కోసమే జోయా అక్తర్ ని కలిశారన్న ప్రచారం జరిగింది. 

37
Suhana khan

ఇక షారుక్ (Shahrukh Khan)వారసురాలిగా ఆమె చిత్ర పరిశ్రమలోనే సెటిల్ కావాలనుకుంటున్నారు. విదేశాల్లో చదువుకున్న సుహానా ఖాన్... న్యూయార్క్ లో ప్రముఖ ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆమె డైరెక్షన్ పట్ల కూడా ఆసక్తిగా ఉన్నారని, దీని ద్వారా మనకు అర్థమవుతుంది.  నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు.

47
Suhana khan

ఇదిలా ఉంటే సుహానా ఓ అజ్ఞాత వ్యక్తితో ఒంటరిగా కారులో కనిపించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మీడియా నుంచి ముఖం చాటేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మన్నత్‌ సమీపంలో ఆమె కారులో ఓ వ్యక్తితో కనిపించింది. వారిని చూసిన మీడియా ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న సుహానా, ఆమె ఫ్రెండ్  ముఖాన్ని చేతులతో కప్పుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 
 

57
Suhana Khan


ఈ క్రమంలో వారు ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందందని, అంతేకాదు ఇంతకి సుహానా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? అతడితో సుహానా రిలేషన్‌ ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో సుహానా సీక్రెట్‌ రిలేషన్‌లో ఉందని, అతను తన సీక్రెట్‌ ఫ్రెండ్‌అని, ఇప్పుడు మీడియాకు అడ్డం బుక్కవడంతో ఇద్దరు ముఖాలు చాటేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సుహానా నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. 

67
Suhana khan


ఇక గత ఏడాది షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యాడు. ముంబై సముద్రంలో ఓ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారాల తరబడి కొడుకు బెయిల్ కోసం షారుక్ ప్రయత్నాలు చేశారు. తన సినిమాలను కూడా షారుక్ పక్కన పెట్టి ఆర్యన్ విడుదల కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. 
 

77
Suhana Khan

కొన్నాళ్లుగా షారుక్ ప్రొఫెషనల్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలో ఆయన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక పర్సనల్ గా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. 
 

click me!

Recommended Stories