దుమారం రేపుతున్న ప్రియా, హమీదల మధ్య బాడీషేమింగ్‌ రచ్చ.. దారుణంగా ట్రోలింగ్‌.. మూడో వారం ఎలిమినేషన్‌ ఫిక్స్?

Published : Sep 21, 2021, 11:40 PM IST

బిగ్‌బాస్‌(biggboss5) హౌజ్‌ 16వ రోజు(మంగళవారం ఎపిసోడ్‌) కూడా నామినేషన్ల(nominations) ప్రక్రియ కొనసాగింది. ఇంటిసభ్యులు ఒకరిపై ఒకరు సంచలన కామెంట్లు చేసుకోవడంతో హౌజ్‌ హీటెక్కిపోయింది. వ్యక్తిగతంగా కామెంట్లు చేసుకోవడం, ఎఫైర్‌ విషయాలను బయటకు తీసుకురావడం ఇప్పుడు హౌజ్‌లో కొత్త రచ్చ షురూ అయ్యింది. 

PREV
17
దుమారం రేపుతున్న ప్రియా, హమీదల మధ్య బాడీషేమింగ్‌ రచ్చ.. దారుణంగా ట్రోలింగ్‌.. మూడో వారం ఎలిమినేషన్‌ ఫిక్స్?

సోమవారం ఎపిసోడ్‌లో లహరి, యాంకర్‌ రవిలు లేట్‌నైట్‌లో హగ్‌ చేసుకున్నారని ప్రియా చేసిన కమెంట్లు సంచలనం సృష్టించాయి. లహరి, రవిలతో ఇతర సభ్యులు కూడా ప్రియాపై ఫైర్‌ అయ్యారు. నేషనల్‌ ఛానెల్‌
ద్వారా ప్రియా ఇచ్చిన కామెంట్లు తప్పుగా ప్రొజెక్ట్ అవుతాయని, మా జీవితాలు ఏమవుతాయంటూ ఆవేదనతో కూడిన ఆవేశంతో ప్రియాపై ఫైర్‌ అయ్యారు. 

27

మంగళవారం ఎపిసోడ్‌లో బాడీ షేమింగ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. హౌజ్‌లో రచ్చ రచ్చగా మారింది. హమీద తన నామినేషన్‌ ప్రక్రియలో ప్రియాని నామినేట్‌ చేశారు. తనని పలు మార్లు బాడీ షేమింగ్‌పై కామెంట్లు చేశారంటూ ఎమోషనల్‌ అయ్యారు. 
 

37

తనతో సరదా డిస్కషన్‌ సమయంలో బాడీ పెయిన్స్ గురించి చెప్పినప్పుడు ఆపరేషన్‌ చేసుకున్నారా? అంటూ పలు మార్లు పాయింట్‌ ఔట్‌ చేస్తూ మాట్లాడినట్టు, అది తనకు చాలా బాధగా అనిపించిందని తెలిపింది హమీద. ఇలాంటి షోలో అలాంటి వ్యాఖ్యలు చేస్తే తన పరిస్థితేంటంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. అయితే దీన్ని ప్రియా ఖండించింది. కానీ అది తనకు చాలా బాగా బాధించిందని హమీద స్పష్టం చేసింది. 

47

ఇందులో నటరాజ్‌ మాస్టర్‌, జెస్సీ మధ్య చిన్నా పెద్ద అనే తేడాతో కూడిన డైలాగుల్‌, నువ్వు బచ్చా అంటూ జెస్సీని నటరాజ్‌ మాస్టర్‌ కామెంట్‌ చేయడం సైతం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మొత్తంగా మూడో వారం ఎలిమినేషన్‌కి లహరి, ప్రియా, శ్రీరామ్‌, మానస్‌, ప్రియాంక నామినేట్‌ అయ్యారు. 

57

అయితే నామినేషన్‌ పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ప్రియా విడి విడిగా లహరి, రవిలతో మాట్లాడింది. క్షమాపణలు చెప్పింది. తాను రియలైజ్‌ అయ్యానని, తాను చెప్పిన మాటలు తప్పుగా కనెక్ట్ అయ్యాయని, తన ఉద్దేశం అది కాదని తెలిపింది. మరోవైపు ప్రియాంక, లోబోలు, నటరాజ్‌ మాస్టర్‌, జెస్సీలు కూడా తమ మధ్య ఉన్న డిఫరెన్స్ ని సరి చేసుకున్నారు. 

67

కానీ నామినేషన్ల ప్రక్రియలో సభ్యుల మధ్య వాదనలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా లహరి, రవిలపై ప్రియా చేసిన కామెంట్లని ట్రోలర్స్ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు హహీదపై బాడీ షేమింగ్‌కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. వీటిని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. సెటైర్లు,పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు నటరాజ్‌ మాస్టర్‌ జెస్సీల మధ్య కన్వర్జేషన్‌ కూడా ట్రోల్‌ అవుతుంది. 
 

77

మొత్తంగా ప్రియాని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అందుకే సీనియర్లని ఇలాంటి షోలకు తీసుకోకూడదని అంటున్నారు. ప్రియా ఇంకా తన తప్పేంటో తెలుసుకోలేకపోతుందని, `షేమ్‌ టూ ప్రియా` అని, బిగ్‌బాస్‌ హౌజ్‌ వరస్ట్ కంటెస్టెంట్‌ అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఈ వారానికి తనే బెస్ట్ ఎలిమినేటర్‌ అని, మూడో వారం ఎలిమినేషన్‌ ఫిక్స్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రియా ట్రోలింగ్‌లో ట్రెండ్‌గా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories