Shruti Haasan: బర్త్ డే బేబీనంటూ బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్... పుట్టినరోజు కోరిక అదేనట!

Published : Jan 28, 2023, 03:11 PM ISTUpdated : Jan 28, 2023, 03:18 PM IST

స్టార్ లేడీ శృతి హాసన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా స్పెషల్ నోట్ షేర్ చేశారు. అలాగే తన పడక గది ఫోటోలు పోస్ట్ చేశారు.   

PREV
16
Shruti Haasan: బర్త్ డే బేబీనంటూ బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్... పుట్టినరోజు కోరిక అదేనట!
Shruti Haasan

కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి బర్త్ డే నేడు. 1986 జనవరి 28న జన్మించిన శృతి 36వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం సుదీర్థ సందేశం పోస్ట్ చేశారు.పుట్టినరోజు నాడు బెడ్ పై నిద్రలేస్తూ దిగిన సెల్ఫీలు పోస్ట్ చేసింది.

26
Shruti Haasan

ప్రతి పుట్టిన రోజుకు క్యాండిల్స్ ఆర్పుతూ మనసులో కొన్ని జరగాలని అనుకుంటాను. ఈ ఏడాది అందరూ తమ కోరికలు నెరవేర్చుకోవాలని, లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుంటాను. నా మంచి కోరుకునే స్వచ్ఛమైన హృదయాలకు ధన్యవాదాలు అంటూ... శృతి మనసులు దోచుకునే పదాలతో అద్భుతమైన సందేశం షేర్ చేశారు.

36
Shruti Haasan

ఇక శృతి ఎర్లీ మార్నింగ్ మేకప్ లెస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  దీంతో అమ్మడు బర్త్ డే గిఫ్ట్ అదిరిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2023ని శృతి గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. సంక్రాంతి హీరోయిన్ రెండు బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి.

46


మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటించినందుకు గాను రూ. 5 కోట్ల వరకు చెల్లించారట. కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.

56


ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. 
 

66


కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు. 
 

click me!

Recommended Stories