మోనాల్ బిగ్‌బాస్4 షోతో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ పాపులారిటీని వాడుకోవాలనుకుంటుంది స్టార్ మా. ఈ అమ్మడికి `డాన్స్ ప్లస్` షోలో జడ్జ్ గా అవకాశం ఇచ్చింది.
ఇందులో ఓ జడ్జ్ గా తనదైన స్టయిల్‌లో మెప్పిస్తుందీ బ్యూటీ. అందాలు ఆరబోస్తూ, తోటి మేల్ జడ్జ్ లతో పులిహోర కలుపుతూ, డాన్సర్లకి ప్రేమ పాఠాలు చెబుతూ హైలైట్‌గా నిలుస్తుంది.
అదే సమయంలో గ్లామరస్‌గా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
తాజాగా ట్రైబల్ తరహా డ్రెస్సులో మోనాల్ కేక పెట్టిస్తుంది. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల కామెంట్లకి గురవుతున్నాయి.
స్టన్నింగ్, సో సెక్సీ, హాట్, ఇంత అందం చూపిస్తూ ఎలా తట్టుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మోనాల్ మరోవైపు బిగ్‌బాస్ హౌజ్ ప్రియుడు అఖిల్‌తో ఇంకా ప్రేమాయణం సాగిస్తూనే ఉంది. ఇప్పటికీ వీరిద్దరు కలుసుకుంటూ బయట కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నారు.
అంతేకాదు పరోక్షంగా తామిద్దరం ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నారు. పైకి మాత్రం మంచి ఫ్రెండ్స్ గా కలరింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి `తెలుగు అబ్బాయి గుజరాజ్ అమ్మాయి` అనేవెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
మోనాల్ ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం `అల్లుడు అదుర్స్`లో ఐటెమ్ సాంగ్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే.