జయలలితే నా ప్రాణాలు కాపాడిందిః విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Published : Feb 25, 2021, 10:26 AM IST

లేడీ సూపర్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తలైవి జయలలిత జయంతి సందర్భంగా బుధవారం ఆమెని తలచుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన ప్రాణాలు కాపాడింది జయలలితే అని పెద్ద సీక్రెట్‌ని రివీల్‌ చేసింది. అభిమానులను షాక్‌ గురి చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

PREV
19
జయలలితే నా ప్రాణాలు కాపాడిందిః విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
బుధవారం జయలలిత జయంతి. ఈ సందర్భంగా విజయశాంతి కూడా ఆమెకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌,ఫేస్‌ బుక్‌ ద్వారా ఆమెతో దిగిన ఫోటోలను పంచుకుంటూ విషెస్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా విజయశాంతి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఆమెని తలచుకుంటూ భావోద్వేగ భరితమైన వ్యాఖ్యలు రాశారు. చాలా వరకు తెలియని ఓ పెద్ద సీక్రెట్‌ని బయటపెట్టారు.

29
ఆమెతో ఉన్న స్నేహాన్ని, ఆమె ఆప్యాయత, అభిమానం, ఆమె తనకిచ్చిన గిఫ్ట్స్ ని తలచుకుని కొనియాడారు విజయశాంతి. అదే సమయంలో తాను టెర్రరిస్ట్ ల హిట్‌ లిస్ట్ లో ఉన్న విషయాన్ని వెల్లడించింది.

39
`అమ్మా.. మీరెక్కడో రాజకుమార్తెగా మళ్లీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవిత కాలపు కానుకలు. తీపి గుర్తులుగా ఎప్పటికీ అలానే ఉంటాయి` అని వెల్లడించింది.

49
ఇంకా చెబుతూ, `మత తీవ్ర వాదుల హిట్‌ లిస్ట్ లో నేను టార్గెట్‌ అయినప్పుడు కొన్ని ఏళ్లపాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇంకా పురట్చి తలైవియిన్‌ అన్బు తంగై(విప్లవ నాయకి జయలలితకి ప్రియమైన చెల్లెలు) ప్రచార భీరంగి(ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఎప్పటికీ ` అని ఎమోషనల్‌ అయ్యింది విజయశాంతి.

59
బీజేపీ జాతీయ నాయకుడు ఎల్ కే అద్వానీ 1998లో తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించినప్పుడు ఆయనపై బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకురాలైన విజయశాంతి అప్పుడు తమిళనాడులో బీజేపీ నాయకురాలిగా జాతీయనేతలతో కలసి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అద్వానీపై బాంబు దాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉగ్రవాది మదానీ డైరీలో తన టార్గెట్‌గా రాసుకున్న పేర్లలో ఎల్ కే అద్వానీ తర్వాత విజయశాంతి పేరు రెండవదిగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది.

69
దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయశాంతి నివాసం వద్ద, ఆమె పర్యటనల్లోనూ డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌లతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయించారు.

79
ప్రస్తుతం విజయశాంతి పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇలాంటి ఘటన జరిగిందా అంటూ కొందరు, ఆ ఘటనని గుర్తుచేసుకుంటూ మరికొందరు పోస్ట్ లు పెడుతూ, వైరల్‌ చేస్తున్నారు.

89
విజయశాంతి ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు. ఆ మధ్య మహేష్‌బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో కీలక పాత్ర పోషించారు. మళ్లీ తానకు సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నారు.

99
మరోవైపు జయలలిత జీవితం ఆధారంగా ప్రస్తుతం `తలైవి` పేరుతో ఓ బయోపిక్‌ చిత్రం రూపొందుతుంది. ఏ.ఎల్‌ విజయ్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories