చెల్లి ఫ్రెండ్‌తో ప్రేమ కథ నడిపించిన `బిగ్‌బాస్‌` మహేష్‌ విట్టా.. ప్రభాస్‌ని ముద్దు పెట్టుకుంటా అంటూ కామెంట్‌

Published : Mar 04, 2022, 10:20 AM IST

`బిగ్‌బాస్‌3` ఫేమ్‌, కమెడీయన్‌ మహేష్‌ విట్టా తన లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. ప్రేమ కోసం రెండేళ్లు వెయిట్‌ చేశాడట. అంతేకాదు ప్రభాస్‌ కలిస్తే ముద్దు పెట్టుకుంటానని, చిరంజీవి మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.   

PREV
17
చెల్లి ఫ్రెండ్‌తో ప్రేమ కథ నడిపించిన `బిగ్‌బాస్‌` మహేష్‌ విట్టా.. ప్రభాస్‌ని ముద్దు పెట్టుకుంటా అంటూ కామెంట్‌

`బిగ్‌బాస్‌ 3`(BiggBoss Telugu 3)తో పాపులారిటీని సొంతం చేసుకున్నారు మహేష్‌ విట్టా(Mahesh Vitta). కమెడీయన్‌గా టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు. చిత్తూరు, కడప యాసలో మాట్లాడుతూ వెండితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. తనకంటూ ఓ సపరేట్‌ ఐడెంటిటీని ఏర్పర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలో సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

27

హీరోలకు ఫ్రెండ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడీయన్‌గా రాణిస్తున్న మహేష్‌ బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలోకి ఎంటర్‌ అవడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. తాను ఎంతో స్ట్రగుల్‌ పడి ఇండస్ట్రీకి వచ్చానని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చానని, అనుకోకుండా ఫన్‌ బకెట్‌ లో చేసే సమయంలో తమ డైరెక్టర్‌ యాక్టర్‌ని చేశానని చెప్పాడు. తన యాస బాగుండటంతో నటననే కంటిన్యూ చేయమని చెప్పాడట. అలా నటుడిగా మారిపోయానని చెప్పాడు. 

37

అయితే తనని ఫన్‌ బకెట్‌ నటుడు, అరే వాడు కర్రోడు అంటూ పిలిచేవారట. కానీ తన పేరు తెలిసేది కాదు. దీంతో మహేష్‌ అనే పేరుని స్క్రీన్‌పై చూపించేవాళ్లమని, ఆ తర్వాత కత్తి మహేష్‌, రంగస్థలం మహేష్‌ అంటూ పిలిచే వారని, ఇలా కాదని ఇంటి పేరుని కూడా అలవాటు చేశానని చెప్పాడు Mahesh Vitta. 

47

తనకు ప్రభాస్‌ ఇష్టమని, ఆయన తన ఇంటికొస్తే అంతకు మించిన ఆనందం లేదని తెలిపారు. ఫస్ట్ ఆయన్ని ముద్దుపెట్టుకుంటానని తెలిపారు మహేష్‌ విట్టా. అయితే బిగ్‌బాస్‌ 3 టైమ్‌లో చిరంజీవి తనని అభినందించిన మాటల ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. షో తాను జెన్యూన్‌గా ఉన్నానని దాదాపు నిమిషంన్నరపాటు చిరంజీవి తనని పొగిడాడని తెలిపారు. దీంతో తనకు ఇండస్ట్రీ చాలా పెద్ద గుర్తింపు వచ్చిందన్నారు. 
 

57

మరోవైపు ఈ సందర్భంగా తన లవ్‌ స్టోరీని రివీల్‌ చేశాడు మహేష్‌ విట్టా. తన జీవితంలో లవ్‌ ఉందని, నాలుగేండ్లుగా ప్రేమ ఉంటున్నామని చెప్పారు. తను తన చెల్లి ఫ్రెండ్‌ అని, ఐటి జాబ్‌ చేస్తుందని,  చెల్లిని కలిసినప్పుడు ఆమె పరిచయమైందని, చూడ్డానికి వాళ్ల అమ్మ పోలికలుండటంతో వెంటనే లవ్‌ ప్రపోజ్‌ చేశాడట.  పరిచయమవగానే ప్రపోజ్‌ ఏంటి? అన్నదట. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. తను ముందే కమిట్‌ అయి ఉంటుందని కానీ నాకు రెండేళ్ల తర్వాత చెప్పిందన్నారు. ఇప్పుడు ఇంట్లో అందరూ ఓకే చెప్పారని, తన సినిమా విడుదలైన తర్వాత మ్యారేజ్‌ చేసుకుంటామని చెప్పారు. 

67

తాను ఎంతో స్ట్రగుల్‌ పడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని, తనలాగా ఎంతో మంది స్ట్రగుల్‌ అవుతున్నారని, వారి కోసం ప్రొడక్షన్‌ హౌజ్‌ని స్టార్ట్ చేసినట్టు చెప్పాడు మహేష్‌ విట్టా. ప్రస్తుతం తనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడట. మిగిలిన వారంతా కొత్త వారని, తన ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఈ సినిమా ద్వారా నలభై మంది కొత్త వారు పరిచయం కాబోతున్నారని, ఆ తర్వాత మరికొంత మందిని కొత్తవారిని పరిచయం చేస్తానని తెలిపారు. తాను సంపాదించిందంతా పెట్టి సినిమా చేస్తున్నానని, పోయినా మళ్లీ తిరిగి సంపాదించుకుంటానని చెప్పారు. విలేజ్‌ నెటివిటీలో సినిమా చేస్తానని తెలిపారు. 

77

ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలో సందడి చేస్తున్న మహేష్‌ విట్టా.. ఈ సారి ధైర్యంగా, నమ్మకంగా షోలో పాల్గొంటానని, తనేంటో నిరూపిస్తానని, కప్‌ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories